Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మమత నిర్ణయంపై మండిపడ్డ విపక్ష అభ్యర్థి మార్గరెట్ ఆల్వా!

ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటామన్న టీఎంసీ… మమతపై మండిపడ్డ విపక్ష అభ్యర్థి మార్గరెట్ ఆల్వా

  • ఇది కోపం, అహం చూపే సమయం కాదన్న మార్గరెట్ ఆల్వా
  • టీఎంసీ నిర్ణయం నిరాశపరిచిందని వ్యాఖ్య
  • మమత ఇకనైనా విపక్షాలకు అండగా నిలుస్తారని భావిస్తున్నానన్న మార్గరెట్

ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటామని మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తమ పార్టీ సభ్యులు ఉప రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్ కు దూరంగా ఉంటారని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ ప్రకటించారు. ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయడంలో విపక్షాల వైఖరి సరిగా లేకపోవడమే దీనికి కారణమని ఆయన చెప్పారు.

ఈ నేపథ్యంలో మమతా బెనర్జీపై విపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఆల్వా మండిపడ్డారు. ఇది కోపం, అహం చూపే సమయం కాదని ఆమె అన్నారు. ఓటింగ్ కు దూరంగా ఉండాలని టీఎంసీ తీసుకున్న నిర్ణయం నిరాశపరిచిందని చెప్పారు. విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడానికి ఇది సమయం కాదని అన్నారు. ఐక్యత కోసం పోరాడాల్సిన సమయం ఇదని చెప్పారు. మమతా బెనర్జీ ఇకనైనా విపక్షాలకు అండగా నిలుస్తారని భావిస్తున్నానని తెలిపారు.

Related posts

విజయమే మన లక్ష్యం.. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంకండి: కమల్ హాసన్!

Drukpadam

ఏపీ కొత్త గవర్నర్ నియామకంపై తృణమూల్ ఎంపీ మహువా విమర్శలు!

Drukpadam

2024 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యతకు నడుం బిగించిన పవార్‌!

Drukpadam

Leave a Comment