Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పెళ్లి కాకపోతే అబార్షన్ చేయించుకోవచ్చు.. సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు!

పెళ్లి కాకపోతే అబార్షన్ చేయించుకోవచ్చు.. సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు!
-తల్లికి ప్రాణానికి ఎలాంటి ముప్పు ఉండరాదని చెప్పిన కోర్ట్
-ముప్పు ఉండదని చెప్పిన ఎయిమ్స్ డైరెక్టర్స్ బోర్డు

ప్రస్తుత కాలంలో కోర్టులు వెలువరించే తీర్పులు సంచలనంగా మారుతున్నాయి. అత్యాచారం, పెళ్లి, విడాకులు, హత్యలు వంటి వివిధ సందర్భాల్లో విచారణ సందర్భంగా న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. రాష్ట్ర హై కోర్టులు, డివిజన్ బెంచ్ కోర్టులు ఇలాంటి తీర్పులు ఇస్తుండగా.. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఇలాంటి తీర్పు వెలువరించింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి అబార్షన్ చేయించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అబార్షన్ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతికి గర్భవిచ్ఛిత్తి చేయించుకునేందుకు అనుమితిచ్చింది. పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి విషయంలో ఈ సంచలన తీర్పు ఇచ్చింది. 25 ఏళ్ల యువతి కొంత కాలంగా ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉంది. ఆ సమయంలో వారి మధ్య శారీరక సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. అయితే పెళ్లి కాకముందే గర్భం దాల్చడంతో ఆమె అబార్షన్ చేయించుకోవాలనుకుంది. అందుకు ఢిల్లీ హైకోర్టును అనుమతి కోరింది. యువతి అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దాంతో ఆ యువతి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఊహించని విధంగా సుప్రీం కోర్టు ఆ యువతి గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతినిచ్చింది.24 వారాల గర్భాన్ని తొలగించే క్రమంలో ఆ యువతికి ఎలాంటి ప్రాణహాని ఉండదని ఎయిమ్స్‌ ఏర్పాటు చేసిన మెడికల్‌ బోర్డ్‌ చెప్పడంతో సుప్రీంకోర్టు అంగీకరించింది. పెళ్లి కానందువల్ల యువతి అబార్షన్‌కు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు 2021లో సవరించిన మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ యాక్ట్‌ను ప్రస్తావించింది. దీని ప్రకారం అలాంటి పరిమితులేమీ లేవని, పెళ్లికాని మహిళలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేస్తూ కీలక తీర్పునిచ్చింది.

Related posts

వృద్ధులకు రాయితీ ఎత్తేయడంతో రైల్వేకు కళ్లు చెదిరే ఆదాయం!

Drukpadam

దర్శనం విషయంలో గొడవ.. కాశీ గర్భగుడిలో కొట్టుకున్న భక్తులు, ఆలయ సిబ్బంది!

Drukpadam

మహారాష్ట్ర మాజీ హోంమంత్రిపై సీబీఐ దర్యాప్తునకు సుప్రీం ఓకే

Drukpadam

Leave a Comment