జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా: కేటీఆర్
కేటీఆర్ పుట్టినరోజు వేడుకలకు భారీ ఏర్పాటు చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు
భారీ వర్షాల నేపథ్యంలో వేడుకలకు దూరంగా ఉంటున్నట్టు కేటీఆర్ ప్రకటన
‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద సహాయం చేయండి
పార్టీ శ్రేణులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని విన్నపం
యాంగ్ డైనమిక్ లీడర్ తెలంగాణ ప్రజల మనసులు గెలుచుకున్న కేటీఆర్ జన్మదిన వేడుకలకు పార్టీ శ్రేణులు సన్నద్ధమైయ్యాయి. అయితే ఆయన అందుకు ససేమీరా అంటున్నారు . తన భర్త డే పేరుతొ ఎవరు వేడకలు జరపవద్దని పార్టీ క్యాడర్ కు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు . మంత్రి తలసాని శ్రీనివాస్ తనయుడు కేటీఆర్ బర్తడే సందర్భంగా అట్టహాసంగా కార్యక్రమాలు నిర్వహించాలని పెద్ద హంగామా చేయాలనీ ఏర్పాట్లు చేసుకున్నారు . అయితే కేటీఆర్ ప్రకటన నిరాశపరిచింది.
వేడుకలకు బదులుగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద సహాయం వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు పేదలకు సహాయం చేయాలనీ కేటీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు . దీంతో హంగామా చేద్దాం అనుకున్న కార్యకర్తలు వాట్ నెస్ట్ అనే మీమాంశలో పడ్డారు . స్థానిక నేతలను అడుగుతున్నారు . అయితే వారు కూడా కేటీఆర్ స్ట్రిక్ట్ గా చెప్పినందున వేడకలు చేయవద్దని ,చేయదలుచుకున్న వాళ్లు భాదితులకు సహాయం అందించాలని చెబుతున్నారు .
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. జన్మదిన వేడుకలకు తాను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జన్మదిన వేడుకలకు తాను దూరంగా ఉంటున్నట్టు ఆయన తెలిపారు.
వరదల వల్ల పలు జిల్లాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద సహాయం చేయాలని… పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు జన్మదిన సంబరాలకు బదులు స్థానికంగా ఉన్న ప్రజలకు సహాయం చేయాలని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు.