Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ యస్ కు షాక్ …ఢిల్లీలో పార్టీ అధికార ప్రతినిధి రామచంద్రుడు గుడ్ బై !

టీఆర్ఎస్‌కు తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌తినిధి రామ‌చంద్రుడు తెజావ‌త్ రాజీనామా..!
టీఆర్ యస్ లో కలకలం …
తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగా కొన‌సాగుతున్న తెజావ‌త్‌
ఐఏఎస్ అధికారిగా సేవ‌లందించిన రామ‌చంద్రుడు
త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌తారంటూ ప్ర‌చారం
రామ‌చంద్రుడు రాజీనామాను ప్రశంసించిన ఆర్ఎస్ ప్ర‌వీణ్‌

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఢిల్లీ లో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక అధికారిగా ఉన్నరిటైర్డ్ ఐఏఎస్ అధిక్కరి తేజావత్ పార్టీకి గుడ్ బై చెబుతూ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు రాజీనామా లేఖ రాశారు . ఇప్పటికే కొంతమంది నాయకులు టీఆర్ యస్ కు గుడ్ బై చెప్పారు . వారిలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు . కొంతమంది జడ్పీటీసీలు , ఇతర ప్రజాప్రతినిధులు పార్టీ కి బై చెపుతుండగా మరికొందరు అదే బాటలో ఉన్నట్లు సమాచారం . ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి రామచంద్రుడు రాజీనామా టీఆర్ఎస్ లో కలకలం రేపింది. చాలా కాలంగా ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఉంటూ ప్రత్యేక అధికారి గా కొనసాగుతున్నారు. నిజాయితీగల అధికారిగా ఆయనకు పేరుంది . అయినప్పటికీ ఆయన రాజీనామా చేయటం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన బీజేపీ చేరబోతున్నురన్న ప్రచారం జరుగుతుంది .ఇందులో వాస్తవం ఎంత ఉన్నప్పటికీ జరుగుతున్న పరిణామాలను బట్టి కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రామచంద్రుడు రాజీనామాపై స్పందిస్తూ ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్న రామచంద్రుని అభినందించారు. ద‌గాప‌డ్డ నాయ‌కులంతా ఈ విష‌యాన్ని గుర్తించాల‌ని, దొరల దగ్గర ఉన్న అనేకమంది ఉద్యమకారులు , నిజాయతి పరులు బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న త‌రుణంలో అధికార పార్టీ టీఆర్ఎస్‌కు శ‌నివారం ఎదురు దెబ్బ తగిలింది. పార్టీలో కీల‌క నేతగా కొన‌సాగుతున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్ర‌భుత్వ ప్రతినిధిగా కొన‌సాగుతున్న రామ‌చంద్రుడు తెజావత్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేర‌కు త‌న రాజీనామా లేఖ‌ను ఆయ‌న టీఆర్ఎస్ అధిష్ఠానానికి పంపడంతో పాటుగా మీడియాకూ విడుద‌ల చేశారు. టీఆర్ఎస్‌కు తాను ఎందుకు రాజీనామా చేస్తున్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న రాజీనామా లేఖ‌లో ప్ర‌స్తావించారు.

ఇదిలా ఉంటే.. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన రామ‌చంద్రుడు త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌నున్న‌ట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై అంత‌గా స్ప‌ష్ట‌త లేకున్నా… బీఎస్పీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ మాత్రం రామ‌చంద్రుడు టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన వైనాన్ని ప్రశంసించారు. ఇప్ప‌టికైనా టీఆర్ఎస్‌, కేసీఆర్ నిజ‌స్వ‌రూపాన్ని తెలుసుకుని సంకెళ్లు తెంచుకుని రామ‌చంద్రుడు బ‌య‌ట‌ప‌డ్డార‌ని ఆయ‌న తెలిపారు. ఆత్మ గౌర‌వానికి మించిన ఆభ‌ర‌ణం లేద‌ని సూచించిన ప్ర‌వీణ్‌ టీఆర్ఎస్ వ‌ద్ద ద‌గాప‌డ్డ నాయ‌కులంతా ఈ విష‌యాన్ని గుర్తించాల‌ని, దొర‌ల పోక‌డ‌ల‌పై పోరాడాల‌ని పిలుపునిచ్చారు.

 

Related posts

కేంద్ర మంత్రి అమిత్ షాకు థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్..!

Drukpadam

నేను ప్రజలు ఎన్నుకున్న సీఎంని.. నీవెవరు?: కేజ్రీవాల్ ఫైర్

Drukpadam

అమిత్ షాను కలిసే అవకాశాన్ని కల్పించండి: కిషన్ రెడ్డికి గద్దర్ విన్నపం!

Drukpadam

Leave a Comment