కేటీఆర్ కాలికి గాయం…మూడువారాల రెస్ట్ అవసరం అన్న డాక్టర్లు !
ఓ కార్యక్రమంలో కిందపడిపోయిన కేటీఆర్
ఈ ప్రమాదంలో కాలి చీలమండకు గాయం
బూటు రూపంలో ఉన్న పెద్ద బ్యాండేజీ వేసుకున్న కేటీఆర్
3 వారాల రెస్ట్ అవసరమని వైద్యుల సూచన
ఓటీటీలో మంచి ప్రోగ్రామ్‌లు ఉంటే చెప్పాలంటూ మంత్రి ట్వీట్
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ కేబినెట్‌లో కీలక శాఖల మంత్రి కేటీఆర్ శనివారం కింద పడిపోయారట. నిత్యం బిజీ షెడ్యూల్‌తో ఉరుకులు పరుగుల మీద ఉండే కేటీఆర్ శనివారం కూడా పలు కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో ఆయన కింద పడిపోయారట. ఈ సందర్భంగా ఆయన కాలు చీలమండకు దెబ్బ తగిలింది. దీంతో ఇంటికి చేరిన కేటీఆర్… కాలి చీలమండకు పెద్ద బూటు లాంటి బ్యాండేజీతో కనిపించారు.
ఓ కార్యక్రమంలో కింద పడిపోయానని, దీంతో చీలమండ దెబ్బతిన్నదని కేటీఆర్ స్వయంగా శనివారం సాయంత్రం ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. చీలమండకు బ్యాండేజీ వేసుకుని కాలు చాపుకుని కూర్చున్న ఫొటోను కూడా ఆయన దానికి జత చేశారు. ఈ సందర్భంగా వైద్యులు 3 వారాల పాటు విశ్రాంతి అవసరమని తెలిపారని చెప్పిన కేటీఆర్…ఈ 3 వారాల పాటు కాలక్షేపం కోసం ఓటీటీలో ఏవైనా మంచి కార్యక్రమాలు ఉంటే తెలపాలంటూ కోరారు.
