Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వరదబాధితులకు మాజీ ఎంపీ పొంగులేటి భారీ వితరణ …15 వేలమందికి సహాయం!

వరదబాధితులకు మాజీ ఎంపీ పొంగులేటి భారీ వితరణ …15 వేలమందికి సహాయం!
కేసీఆర్ బర్తడే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ అన్న పొంగులేటి
-అడవిబిడ్డల కన్నీరు చూసి చలించిపోయానన్న పొంగులేటి
-అకలితో అలమటిస్తున్న వారి బాధ నన్ను కలిచివేసిందని ఆవేదన
-ఉడతాభక్తిగా నిత్యావసర సామాగ్రి పంపిణీకి శ్రీకారం చుట్టానని వివరణ
-రూ.కోటి విలువచేసే సరుకులు 15వేల మంది బాధిత కుటుంబాలకు అందేలా సాయం
-కేటీఆర్ జన్మదినం సందర్భంగా అందజేయడం శుభపరిణామం
-జోరు వానలోనూ బాధితులకు నిత్యావసర సామాగ్రిని స్వయంగా అందజేసిన శీనన్న

ఇటీవల గోదావరి నదికి వచ్చిన వరదల వల్ల నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్న భాదితులకు టీఆర్ యస్ రాష్ట్ర నాయకుడు , ఖమ్మం మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భారీ వితరణ అందజేశారు . ఒక్కరోజులోనే పెద్ద వాహనాలతో తీసుకోని పోయిన శ్రీనివాస్ రెడ్డి వరదలకు పెద్ద ఎత్తున నష్టపోయిన భాదితులను స్వయంగా అందజేశారు . ఈ సందర్భంగా ఆయాగ్రామాల్లో ప్రజలు తమను ఎంతవరకు ఎవరు పట్టించుకోలేదని మీరు వచ్చి సహాయం చేస్తున్నారని రెండు చేతులు జోడిందించి దండం పెట్టారు . మొత్తం పోయిన సామాన్లను ఇవ్వలేక పోయిన తన శక్తి మేరకు సహాయం చేస్తున్నానని తెలిపారు . గ్రామాలకు వెళ్లి సహాయం అందజేయటం పై పొంగులేటి పై భాదితులు ప్రసంశలు కురిపిస్తున్నారు . సుమారు కోటి రూపాయలకు పైగా విలువైన నిత్యావసర వాస్తు సామాగ్రిని ప్యాకెట్స్ రూపంలో భద్రాచలం , బూర్గంపహాడ్ మండలంలోని గ్రామాల్లో అందజేశారు . ఇది కేసీఆర్ బర్తడే సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా అందజేస్తున్నామని పొంగులేటి తెలిపారు . .

ప్రకృతి ప్రకోపానికి గురై తినడానికి తిండి లేక… తల దాచుకోవడానికి చోటు లేక ఎన్నో అవస్థలు పడుతున్న అడవిబిడ్డల కన్నీరును చూసి చలించిపోయాను. నిద్రహారాలు మాని వారు పడుతున్న బాధలు నన్ను కలిచివేశాయి. ఈనేపథ్యంలోనే దేవుడు నాకు అడవిబిడ్డల ఆకలి తీర్చేందుకు ఇచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావించి నా వంతు ఉడతాభక్తి సాయంగా నిత్యావసర సామాగ్రి పంపిణీకి శ్రీకారం చుట్టానని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు, తెరాస రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి గురై ముంపులో చిక్కుకుని అనేక అవస్థలు పడుతున్న అడవిబిడ్డల ఆకలి తీర్చేందుకు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూనుకున్నారు. బూర్గంపాడు, భద్రాచలం మండలాలకు చెందిన ముంపు బాధితులకు ఈ ఆర్థికసాయం అందేంచేందుకు నిర్ణయించారు. సుమారు 15వేల మంది బాధిత కుటుంబాలకు రూ. కోటి రూపాయాల నిత్యావసర సామాగ్రిని పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి నిత్యావసర సామాగ్రిని పొంగులేటే స్వయంగా అందజేశారు. ఓ వైపు జోరువాన కురుస్తున్నప్పటికి ఆగకుండా బాధిత కుటుంబాల సంక్షేమమే తనకు ముఖ్యమని పేర్కొంటూ వరద ముంపులో నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను పరామర్శించారు. వారికి అండగా ఉంటానని హామీ ఇస్తు ఆర్థికసాయాలను అందజేశారు. వరదముంపులో చిక్కుకున్న అనేక మందిని తన ధైర్యసాహసాలు కనబర్చి ప్రాణాలు కాపాడిన వ్యక్తిని ఘనంగా సత్కారించారు.

అనంతరం పొంగులేటి మాట్లాడుతూ కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట ఈ కార్యక్రమాన్ని చేపట్టడం శు భపరిణామమని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ అడవిబిడ్డలకు అండగా ఉంటానని, వారికి ఏ కష్టమొచ్చినా వారు అడగకుండానే సాయంచేసేందుకు ముందుకు వస్తానని భరోసా ఇచ్చారు. మన యువ నాయకుడు కేటీఆర్ పిలుపు మేరకు ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయి నానా అవస్థలు పడుతున్న బాధిత కుటుంబాలను మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆదుకోవాలని, వారికి కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు అందేలా చొరవ చూపాలని కోరారు.

పొంగులేటి వెంట పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు, జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవి, అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత, జెడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ గోపిరెడ్డి, కడియం రామాచారి, భద్రాచలం టీఆర్ఎస్ అధ్యక్షులు తిరుపతిరావు, ఘంటా కృష్ణ, నవాబు, నక్క ప్రసాద్, ఏసు రెడ్డి, బిజ్జం వెంకటేశ్వరరెడ్డి, పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, బూర్గంపాడు సర్పంచ్, రెడ్డిపాలెం సర్పంచ్, శంకర్ రెడ్డి, క్రాంతి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మట్టా దయానంద్, డాక్టర్ కోటా రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

 

Related posts

మాస్క్ ధరించని ట్రాఫిక్ సీఐ.. జరిమానా విధించాలన్న ఎస్పీ

Drukpadam

12 Holistic Nutrition Tips to Get Beautiful Skin This Season

Drukpadam

టీడీపీలో చేరేందుకు చంద్రబాబుతో మాట్లాడుకున్న ఎమ్మెల్యే శ్రీదేవి ….

Ram Narayana

Leave a Comment