Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల సంక్షేమం వైపు సంఘం దృష్టిపెట్టాలి…

జర్నలిస్టుల సంక్షేమం వైపు సంఘం దృష్టిపెట్టాలి…
-విద్యా ,వైద్యం విషయంలో జర్నలిస్ట్ కుటుంబాలకు సహాయపడేలా చర్యలు తీసుకోవాలి
-దళిత జర్నలిస్టులకు దళితబందు అమల్లో ప్రాధాన్యత ఇవ్వాలి
-అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు,అక్రిడేషన్ లు ఇవ్వాలి
-జర్నలిస్టులకు ఉచిత వైద్యం అమల్లో లోపాలను సరిదిద్దాలి
-అన్ని ఆస్పత్రుల్లో హెల్త్ కార్డు లు అమలకు చర్యలు తీసుకోవాలి
-టీయూడబ్ల్యూజే (ఐ జే యు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రామ్ నారాయణ

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు సాధించడంతోపాటు వారి సంక్షేమం పై సంఘం దృష్టి పెట్టాలని టీ యు డబ్ల్యూ జే (ఐ జే యు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రామ్ నారాయణ పిలుపునిచ్చారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఖమ్మం నగర కమిటీ కార్య వర్గ సమావేశం ఆదివారం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి మారేమ్మ గుడి దేవస్థానం వద్ద ఎం ఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో నగర కమిటీ అధ్యక్షుడు మైసా పాపారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కె .రామ్ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా జర్నలిస్టుల సంక్షేమం పై ఏ ఒక్క ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని ఆరోపించారు. ఎన్నో ఏళ్ల కలల స్వప్నంగా ఉన్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు సాధించడంతో పాటు వారు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం టీ యు డబ్ల్యు జే (ఐ జే యు) నాయకులు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నేడు విద్య వైద్యం కోసం జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడుతున్నవిషయాన్నీ ఆయన ప్రస్తావించారు. జర్నలిస్టుల సమస్యల పై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని , సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలపై సమావేశంలో సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు సాధించాలని, దళిత జర్నలిస్టు మిత్రులకు ప్రాధాన్యత గా దళిత బంధు వర్తింపజేయాలని, జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు కల్పించాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం యూనియన్ పరంగా వర్తింపజేయాలని పలు తీర్మానాలు చేసి ఆమోదించారు. ఈ సమావేశంలో యూనియన్ ఖమ్మం నగర ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు కార్యదర్శి నివేదికను ప్రవేశ పెట్టారు . సమావేశంలో తొలుత ఇటీవల కాలంలో మరణించిన జర్నలిస్ట్ బైరు కరంచంద్ గాంధీ,విధినిర్వహణలో మరణించిన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ తదితరులకు సమావేశం నివాళులు అర్పించి సంతాపం సానుభూతి ప్రకటించారు.

ఈ సమావేశానికి అతిథులుగా రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావు, రాష్ట్ర నాయకులు, అక్రిడేషన్ కమిటీ మెంబర్ గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్ , సైదులు, రాష్ట్ర నాయకులు, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాటేటి వేణుగోపాల్, జిల్లా కోశాధికారి శివ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ యేగినాటి మాధవరావు, ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కమటం శ్రీనివాస్, జిల్లా నాయకులు జనార్దనా చారి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు . సమావేశంలో పలువురు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా బ్యూరోలు, డెస్క్ ఇన్చార్జిలు, స్టాఫ్ రిపోర్టర్ లతో పాటు ఖమ్మం నగర కమిటీ ఉపాధ్యక్షులు శీలం శ్రీనివాస్, సంఘ బాధ్యులు కొమ్మినేని ప్రసాదరావు, సాగర్ రెడ్డి, రాయల బసవేశ్వర రావు, ఉపేందర్, మధులత, రమేష్, రమేష్, శ్రీధర్, సంపత్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేశారు. జర్నలిస్టులకు విద్య వైద్యం సమస్యలపై పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు.

Related posts

మామిడిపళ్ల కోసం లండన్‌ నగరంలో తన్నుకున్న జనం…!

Drukpadam

భారత్‌లో ఆఫ్రికన్‌ స్వైన్‌ఫ్లూ.. అలర్టయిన అధికారులు!

Drukpadam

కిడ్నాపర్లు ఎంపీ భార్య, కొడుకు, ఆడిటర్ ను కట్టేసి.. రూ.1.75 కోట్లను వసూలు చేశారు: డీజీపీ

Drukpadam

Leave a Comment