Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆధార్‌ సంఖ్యతో ఓటరు కార్డుల అనుసంధానానికి రంగం సిద్ధం …కోర్ట్ లో సవాల్ చేసిన కాంగ్రెస్!

ఆధార్‌ సంఖ్యతో ఓటరు కార్డుల అనుసంధానానికి రంగం సిద్ధం …కోర్ట్ లో సవాల్ చేసిన కాంగ్రెస్!
-ఆగస్ట్ 1 నుంచి ఆధార్ తో ఓటర్ కార్డు అనుసంధానం కార్యక్రమం
-ఇది పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్యగా అభివర్ణించిన కాంగ్రెస్
-పౌరుల గోప్యతను దెబ్బతీసేలా చర్యలు …సమానత్వపు హక్కుల ఉల్లంఘన

ఆధార్‌ సంఖ్యతో ఓటరు కార్డుల అనుసంధానానికి రంగం సిద్ధమవుతోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వివాదాస్పద చట్టాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీన్ని రద్దు చేయాలంటూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా డిమాండ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆధార్‌తో ఓటర్‌ ఐడీ అనుసంధానం చట్టవిరుద్ధమైనదిగా పేర్కొంటూ.. ప్రజల గోప్యత, సమానత్వపు హక్కులను ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో తెలిపారు. ఆయన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరపనుంది.

మరోవైపు, ఆధార్‌ సంఖ్యతో ఓటరుకార్డుల అనుసంధాన ప్రక్రియను ఆగస్టు 1 నుంచి ప్రారంభించాలని కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు జారీచేసింది. ‘‘ఆధార్‌ అనుసంధానం స్వచ్ఛందం మాత్రమే. తప్పనిసరి కానేకాదు. ఓటు హక్కు వినియోగానికీ ఆధార్‌ అనుసంధానానికి ఎలాంటి సంబంధం ఉండదు’’ అని కేంద్రం చెబుతోంది. అయితే, త్వరలోనే అన్ని స్థాయుల అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆధార్‌ అనుసంధానంతో బోగస్‌ ఓటర్లను తొలగించటం సులభమవుతుందని కేంద్రం వాదిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల సంస్కరణల ప్రక్రియలో భాగంగా ఈసీ ఓటర్‌ ఐడీతో ఆధార్‌ను అనుసంధానం చేసే ప్రాజెక్టును చేపట్టింది. ఓటర్ల జాబితా నుంచి బోగస్‌ ఓట్లను ఏరివేసి.. తప్పులు లేకుండా చేసేందుకు యోచిస్తోంది. అయితే, ఆధార్‌-ఓటరు కార్డు అనుసంధానంతో దేశంలో పౌరులు కానివారు ఎక్కువమంది ఓటువేసే అవకాశం ఉంటుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.

Related posts

రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు.. రూ. 800 కోట్ల నల్లధనం లావాదేవీల గుర్తింపు!

Drukpadam

ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీస్‌ హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు: పోలీస్ కమిషనర్

Drukpadam

పార్టీలన్నీ తీసికట్టు.. 2021-22లో బీజేపీకి రూ.1,161 కోట్ల ఆదాయం!

Drukpadam

Leave a Comment