కేసీఆర్ భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు
- ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లకపోవచ్చన్న తమిళిసై
- జాతీయ రాజకీయాల్లోకి రావాలనేదే కేసీఆర్ లక్ష్యమన్న గవర్నర్
- అందుకే ప్రధాని మోదీపై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్య
- గవర్నర్‌గా ప్రోటోకాల్‌ను ఆశించడం లేదని వివరణ
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం రాత్రి ఢిల్లీ పర్యటనకు బయలుదేరుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి కీలక తరుణంలో కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు వ్యూహాలపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం మధ్యాహ్నం సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ సీఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని తపన పడుతున్నారని కానీ అది ఆయనకు అసాధ్యమని తెలంగాణ గవర్నర్ తమిళ సై పేర్కొన్నారు. కేసీఆర్ ఈ రోజు ఢిల్లీ పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్నపరిణామాలపై కీలక వ్యాఖ్యానాలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య ఉన్న వేదాలపై కూడా ఆమె మరోమారు స్పందించారు. సీఎం గవర్నర్ బంగ్లాకు వచ్చి వెళ్ళిన తర్వాత కూడా ఈ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడం శోచనీయం అన్నారు. తాను మిగతా రాష్ట్రాల గవర్నర్లకు అందుతున్న ప్రోటోకాల్ గురించి ఆలోచించడం లేదని ప్రజలకు దగ్గరగా ఉండటమే తనకు ఇష్టమని పేర్కొన్నారు, ఇటీవల గోదావరి వరదలు వచ్చినప్పుడు భద్రాచలం ప్రాంతంలో తాను పర్యటించిన సందర్భంగా అధికారులు ఎవరు తన వద్దకు రాలేదని ప్రోటోకాల్ పాటించలేదని ఆమె అన్నారు . తెలంగాణ గవర్నర్ బంగ్లాకు సీఎం క్యాంపు కార్యాలయం మధ్య సంబంధాలు బెడిసి కొట్టిన నేపథ్యంలో సీఎం గవర్నర్ కార్యాలయానికి వెళ్లడం పరిస్థితులు చక్కబడ్డాయని అనుకుంటున్నా సమయంలో అలాంటిదేమీ లేదని గవర్నర్ వ్యాఖ్యలను బట్టి స్పష్టమైంది. ఈ విషయాలు గవర్నర్ స్వయంగా వెల్లడించారు . కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ప్రధాని మోడీ ని విమర్శిస్తున్నారని ఆమె అన్నారు .
తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ బంగ్లాకు సీఎం క్యాంపు కార్యాలయం అయిన ప్రగతి భవన్ కు మధ్య దూరం మరింతగా పెరిగింది …చాలాకాలంగా గవర్నర్ కు సీఎంకు మధ్య మంచి సంబంధాలు లేవు ..ప్రధానంగా కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీ గా అధికార టీఆర్ యస్ సిఫార్స్ లను ఆమె అడ్డుకున్నారు . నాటినించి సంబంధాలు దెబ్బతిన్నాయి. అనేక సందర్భాలలో ఆమె గవర్నర్ గా కాకుండా బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని టీఆర్ యస్ విమర్శలు చేస్తూ వస్తుంది. ఇటీవల కాలంలో ఆమె రాష్ట్రంలో జరుపుతున్న పర్యటనల్లోగాని అంతకు ముందు గవర్నర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన అధికారిక కార్యక్రమాలకు అధికారులు ,మంత్రులు ఎవరు వెళ్ళాక పోవడం సంబంధాలను మరింత దెబ్బతీసింది .
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలన్న లక్ష్యంతోనే ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తున్నారని కూడా ఆమె అన్నారు. అయితే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశించడం అసాధ్యమని ఆమె అన్నారు.
ఇక తనకు తెలంగాణ ప్రభుత్వంతో కొనసాగుతున్న దూరంపైనా తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గవర్నర్‌గా ప్రోటోకాల్‌ను ఆశించడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఇటీవలే రాజ్ భవన్ కు వచ్చి వెళ్లాక కూడా తన ప్రోటోకాల్‌లో ఎలాంటి మార్పు లేదని ఆమె తెలిపారు. మొన్న భద్రాచలం వెళ్లినా అధికారులు ఎవరూ రాలేదని ఆమె అన్నారు. ఇతర రాష్ట్రాల గవర్నర్లు, వారికి దక్కుతున్న ప్రోటోకాల్‌తో తనను పోల్చుకోనని కూడా ఆమె తెలిపారు. ప్రజలకు దగ్గరగా ఉండటమే తన నైజమని తమిళిసై వ్యాఖ్యానించారు.