Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడి రిసార్టులో వ్యభిచారం.. 73 మంది అరెస్ట్!

మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడి రిసార్టులో వ్యభిచారం.. 73 మంది అరెస్ట్!

  • పక్కా సమాచారంతో బెర్నార్డ్ ఫాంహౌస్‌పై దాడిచేసిన పోలీసులు
  • గదిలో బంధించిన ఆరుగురు మైనర్లకు విముక్తి
  • ఓ బాలికపై వారం రోజుల్లో పలుమార్లు అత్యాచారం
  • వాహనాలు, వందలాది మద్యం సీసాలు,  కండోములు స్వాధీనం
  • కుట్ర అంటున్న బెర్నార్డ్

మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ ఎన్ మారక్‌పై మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది. వెస్ట్ గరోహిల్స్ జిల్లాలోని తురలోని ఆయన రిసార్ట్‌పై దాడిచేసిన పోలీసులు ఆరుగురు బాలికలను రక్షించారు. 73 మందిని అరెస్ట్ చేశారు. మాజీ మిలిటెంట్ నేత అయిన బెర్నార్డ్‌‌కు చెందిన రింపు బగాన్ ఫాం హౌస్‌లో వ్యభిచారం జరుగుతోందన్న పక్కా సమాచారంతో దాడిచేసినట్టు వెస్ట్ గరో హిల్స్ సూపరింటెండెంట్ వివేకానంద్ సింగ్ తెలిపారు.

ఈ సందర్భంగా నలుగురు బాలురు, ఇద్దరు బాలికలను రక్షించినట్టు చెప్పారు. బెర్నార్డ్, ఆయన సహచరులు వ్యభిచార గృహం నడుపుతున్న రింపు బగాన్‌లోని అపరిశుభ్రమైన గదులలో వీరిని బంధించినట్టు గుర్తించామన్నారు. రక్షించిన వారిని జిల్లా బాలల సంరక్షణ అధికారి (DCPO)కి అప్పగించినట్టు తెలిపారు.

బెర్నార్డ్ ఫాంహౌస్‌పై దాడిచేసిన పోలీసులు 27 వాహనాలు, 8 బైక్‌లు, 400 సీసాల మద్యం, 500 కండోములు, విల్లంబులు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మెటీరియల్‌ను బట్టి అక్కడ వ్యభిచారం జరుగుతున్నట్టు అర్థమవుతోందన్నారు. ఫాం హౌస్‌లో చిన్నచిన్న గదులు 30 ఉన్నట్టు చెప్పారు. అలాగే, 73 మందిని అరెస్ట్ చేశామన్నారు. మైనర్‌పై ఒక వారంలో అనేకసార్లు అత్యాచారం జరిగినట్టు నిర్ధారించినట్టు ఎస్పీ పేర్కొన్నారు.  ఈ ఘటనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు.

తనను, తన స్నేహితుడిని నిందితులు రింపు బగన్‌కు తీసుకెళ్లారని బాధితురాలు కోర్టుకు తెలిపింది. నిందితులు అక్కడ ఓ గదిని అద్దెకు తీసుకుని తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పేర్కొంది. రింపు బగాన్‌లో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ తురా వాసుల నుంచి పలుమార్లు మౌఖిక ఫిర్యాదులు అందినట్టు పోలీసులు తెలిపారు. రైడ్ సందర్భంగా యువతీయువకులు దుస్తులు లేకుండా మద్యం తాగుతూ కనిపించినట్టు పేర్కొన్నారు. ఆ 68 మందినీ అరెస్ట్ చేసినట్టు వివరించారు. వారితోపాటు మేనేజర్, కేర్‌టేకర్, ముగ్గురు సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు.

మరోవైపు, తనపై వచ్చిన ఆరోపణలను బెర్నార్డ్ కొట్టిపడేశారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. సీఎం కొన్రాడ్ సంగ్మా తనపై కక్ష కట్టారని, ఆయన ఆదేశాలతోనే పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండా దాడులు చేశారని ఆరోపించారు. మైనర్లు అయిన విద్యార్థులను తన ఖర్చుతో చదివిస్తున్నట్టు చెప్పారు. కాగా, రాష్ట్రంలో అధికారంలో వున్న మేఘాలయ డెమొక్రటిక్ అలయెన్స్ (MDA)లో బీజేపీ కూడా భాగస్వామి కావడం గమనార్హం.

6 children rescued and 73 arrested after police raids Meghalaya BJP leaders resort

Related posts

వామ్మో.. ఈకిలాడీ …50 పెళ్ళిళ్ళు చేసుకుంది..!

Ram Narayana

వివేకా కేసులోకోత్త ట్విస్ట్ …బీటెక్ రవి ,వివేకా అల్లుడు అనుమానితులన్న శివశంకర్ రెడ్డి భార్య!

Drukpadam

రాజస్థాన్‌లో క్రూరం.. మద్యం మాఫియాపై ఫిర్యాదు చేసిన ఆర్టీఐ కార్యకర్త కాళ్లలో మేకులు దిగ్గొట్టిన దుండగులు

Drukpadam

Leave a Comment