Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నూతన మండలంగా ‘ఇనుగుర్తి’…సీఎం ఆదేశాలు …ఫలించిన ఎంపీ వద్దిరాజు కృషి !

నూతన మండలంగా ‘ఇనుగుర్తి’…సీఎం ఆదేశాలు …ఫలించిన ఎంపీ వద్దిరాజు కృషి !
– సీఎం కేసీఆర్ ఆదేశాలు
– ఎంపీ వద్దిరాజు విజ్ఞప్తికి స్పందన
– దీర్ఘకాలిక డిమాండ్ సాకారం
-ఎంపీ కృషికి హర్షాతిరేకాలు
-సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన వద్దిరాజు

మహబూబాబాద్ జిల్లాలోని చారిత్రక ప్రాధాన్యత కలిగిన ‘ఇనుగుర్తి’ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇనుగుర్తి మండలం చేయాలని చాలా కాలంగా అక్కడి ప్రజల ఆకాంక్ష కొనసాగుతున్నది.
ఈ నేపథ్యంలో ఇనుగుర్తిని మండలంగా ఏర్పాటు చేయడానికి ఉన్న అర్హతలు.. చారిత్రక నేపథ్యాన్ని.. ఆ గ్రామానికి చెందిన రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆదివారం నాడు ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ ను కలిసి విజ్జప్తి చేశారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు, ఎంపీ ఎమ్మెల్యేలను సోమవారం నాడు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కు పిలిపించుకుని, చర్చించారు. అక్కడి ప్రజలు, ప్రజా ప్రతినిధుల దీర్ఘకాలిక కోరిక మేరకు ముఖ్యమంత్రి ఇనుగుర్తి ని మండలంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సిఎం కెసిఆర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎమ్మెల్సీ రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సీఎం కు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కృతజ్ఞతలు

తమ గ్రామాన్ని మండలకేంద్రంగా చేయాలనీ చేసిన విజ్ఞప్తిని మన్నించి అధికారులు ప్రజాప్రతినిధులతో చర్చించి మండలకేంద్రంగా ప్రకటించడం పై రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు . ఆప్రాంత ప్రజల కోరికను సీఎం నెరవేర్చడం తో ఆయనకు మండల ప్రజలు రుణపడి ఉన్నారని అన్నారు . ఇందుకు సహకరించిన ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులకు , ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు .

Related posts

తెలంగాణాలో కొలిక్కి రాని పీ ఆర్ సి -ఉద్యోగుల ఎదురుచూపులు

Drukpadam

జూన్ లో వీటికి ముగిసిపోతున్న గడువు.. త్వరపడండి..!

Drukpadam

హైద్రాబాద్,రంగారెడ్డి,మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ యస్ స్వల్ప ఆధిక్యం

Drukpadam

Leave a Comment