గ్రానైట్ పరిశ్రమపై భారాలు తగ్గించండి – సీఎస్ కు అసోసియేషన్ వినతి!
-ప్రభుత్వం ఇచ్చిన 7 జి ఓ లద్వారా ఇబ్బందుల్లో గ్రానైట్ ఇండస్ట్రీ
-ఇచ్చిన జి ఓ లను రద్దు చేయాలి
-పన్నులతో కుదేలవుతున్న గ్రానైట్ పరిశ్రమను కాపాడండి
-రాయితీలు కల్పించి పరిశ్రమను ఆదుకోండి
తెలంగాణలోని లక్షలాదిమందికి ఉపాధి కల్పిస్తూ ప్రధాన ఆదాయవనరుగా ఉన్న గ్రానైట్ పరిశ్రమను ఆదుకునేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని గ్రానైట్ అసోసియేషన్ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేసింది. అసలే ఇబ్బందుల్లో ఉన్న పరిశ్రమలో ప్రభుత్వం ఇచ్చిన వివిధరకాల జి ఓ లద్వారా ధరలు ఎక్కువై పరిశ్రమ మనుగడే ప్రశ్నర్ధకంగా మారె ప్రమాదం ఉందని అసోసియేషన్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు . ప్రభుత్వం మోపిన భారాలు తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని వారు సి ఎస్ కు విజ్ఞప్తి చేశారు .
గ్రానైట్ పరిశ్రమపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మోపిన భారాలు తగ్గించాలని, పరిశ్రమలకు రావాల్సిన రాయితీలు తక్షణం మంజూరు చేయాలని తెలంగాణ గ్రానైట్ పరిశ్రమ యజమానుల సంఘం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు విజ్ఞప్తి చేసింది. మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, కవితతో కలిసి అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం సచివాలయంలో సీఎస్ ను కలిసారు. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన 7 జీవోల ద్వారా సీనరేజి, డెడ్ రెంట్, పర్మిట్, క్వారీ లీజులు, అనుమతులకు గతంలో ఉన్న ధరలను రెట్టింపు చేయడం వల్ల గ్రానైట్ పరిశ్రమ కుదేలవుతోందని అసోసియేషన్ ప్రతినిధులు సీఎస్ కు నివేదించారు. తక్షణమే జీవో లు రద్దు చేయాలని కోరారు. గడిచిన 5 ఏళ్లుగా పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు మంజూరు చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఎస్ ను కలిసిన వారిలో గ్రానైట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు రాయల నాగేశ్వరరావు, ఉప్పల వెంకటరమణ, పాటిబండ్ల యుగంధర్, జి. శంకర్ తదితరులు ఉన్నారు.