హైదరాబాద్ లో బీభత్సం సృష్టించిన భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం..!
-ఆందోళనలో ప్రజలు …చెరువులుగా మారిన వీధులు
-వరదలకు కొట్టకపోయిన వాహనాలు
-కొన్ని జంతువులూ కూడా వరదల్లో పోయాయి
-ఇళ్లలోకి చేరిన నీరు …వంటసాగిరి సైతం వరదల్లో
-అర్థరాత్రి ఒక్క సరిగా వచ్చిన కుండపోత వర్షం
హైదరాబాద్ లో బీభత్సం సృష్టించిన భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి నారాయణ గూడ, పాతబస్తీ యాకుత్‌పురా, మల్లేపల్లి వంటి అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. భాగ్యనగరంలో అర్ధరాత్రి మరోసారి కుండపోత వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అమీర్ పేట్ పంజాగుట్ట, బంజారాజిల్స్, జూబ్లీహిల్స్, కోఠి, అబిడ్స్, దిల్ షుక్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్, నారాయణ గూడ, పాతబస్తీ యాకుత్‌పురా, మల్లేపల్లి వంటి అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పాతబస్తీ యాకుత్‌పురా, మల్లేపల్లిలో భారీ వర్షానికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. వరదలో జంతువులు చిక్కుకున్నాయి. కొన్ని జంతువులు కొట్టుకుపోయాయి. రహదారులు నదులను తలపించాయి. బేగం బజార్‌లో ఇళ్లు, షాపుల్లోకి చేరిన వర్షం నీరు చేరుకుంది. ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సామాగ్రి, నిత్యావసర వస్తువులు నీట మునగిపోయాయి. దీంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అనేక ప్రాంతాల్లో ప్రధాన రహదారులపై మోకాల్లోతు నీరు నిలిచింది. దీంతో జీహెచ్ఎంసీ సి లో ప్రజలు విలపిస్తున్నారు . తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు .