Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాష్ట్రపత్ని అనడం తప్పే….వెనక్కు తగ్గిన అధిర్ రంజన్ చౌదరి

రాష్ట్రపత్ని అనడం తప్పే….వెనక్కు తగ్గిన అధిర్ రంజన్ చౌదరి
-కానీ వాళ్లు సోనియా విషయంలో, శశిథరూర్ భార్య విషయంలో ఏమన్నారు?:
-ముర్మును రాష్ట్రపత్ని అన్న కాంగ్రెస్ నేత
-భగ్గుమన్న బీజేపీ నేతలు
-వివిధ వర్గాల నుంచి విమర్శలు
-వెనక్కి తగ్గిన అధిర్ రంజన్ చౌదరి
-‘రాష్ట్రపత్ని’ వ్యాఖ్యల వివాదం… అధిర్ రంజన్ చౌదరికి మహిళా కమిషన్ నోటీసులు
-తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్
-ఆగస్టు 3న విచారణకు రావాలంటూ నోటీసులు
-సోనియాకు లేఖ.. చౌదరిపై చర్యలు తీసుకోవాలని స్పష్టీకరణ

దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత అధిర్ రంజన్ చౌదరి ‘రాష్ట్రపత్ని’ అని సంబోధించడం తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో అధిర్ రంజన్ చౌదరి వెనక్కి తగ్గారు. తాను ‘రాష్ట్రపత్ని’ అనడం తప్పేనని అంగీకరించారు. అయితే బీజేపీ నేతలపై మండిపడ్డారు.

“ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని వాళ్లు ఏమన్నారు? శశిథరూర్ భార్య గురించి ఏం మాట్లాడారు? రేణుకా చౌదరిపై ఏమన్నారు? అంటూ ప్రశ్నించారు. తాను రాష్ట్రపత్ని వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుతానని చౌదరి స్పష్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్ మెంట్ కోరి, ఆమెను వ్యక్తిగతంగా కలిసి వివరిస్తారని వెల్లడించారు. ఎల్లుండి ఆమె అపాయింట్ మెంట్ లభిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అని పేర్కొనడం ద్వారా కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి చిక్కుల్లో పడ్డారు. ఈ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగ. నించింది చౌదరికి నోటీసులు జారీ చేసింది. తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని, వ్యాఖ్యల పట్ల లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఆగస్టు 3వ తేదీ ఉదయం 11.30 గంటలకు విచారణ ఉంటుందని వెల్లడించింది.
అంతేకాదు, జాతీయ మహిళా కమిషన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కూడా లేఖ రాసింది. ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలని, అనుచిత వ్యాఖ్యలు చేసిన అధిర్ రంజన్ చౌదరిపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

Related posts

అంతా బేకార్.. కొత్త పార్లమెంట్ తో ఏం అవసరం?: బీహార్ సీఎం నితీశ్ విమర్శలు…

Drukpadam

వ్యవస్థలను మేనేజ్ చేయగలరు , ప్రజలను చేయలేరు: చంద్రబాబుపై బొత్స వ్యాఖ్యలు

Drukpadam

గిరిజనులకంటే దళితులకే భూమి తక్కువ …అసెంబ్లీ లో కేసీఆర్ …

Drukpadam

Leave a Comment