Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మునుగోడులో ఓట్లు బీసీలవి …సీట్లు ఓసీలవి ఇదెక్కడి సామాజిక న్యాయం ….?

మునుగోడులో ఓట్లు బీసీలవి …సీట్లు ఓసీలవి ఇదెక్కడి సామాజిక న్యాయం ….?
గణనీయమైన సంఖ్యలో ఎస్సీల ఓట్లు
మునుగోడు లో మొత్తం ఓట్లు 226520 మంది
రెడ్డి సామాజికవర్గం ఓట్లు కేవలం ఏడున్నర వేలే

ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు ఉపఎన్నిక సాక్షిగా సామజిక న్యాయం మంటగలుపుతున్నారనే విమర్శలు ఉన్నాయి.రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ప్లేట్ ఫిరంయించి బీజేపీ జైకొట్టడంతో ఎన్నిక అనివార్యం అయింది. ఒక్క బీజేపీ మినహా ఈ ఉపఎన్నికను ఎవరు మనస్ఫూర్తిగా ఆహ్వానించడంలేదు . అవకాశవాద రాజకీయాలకు మునుగోడు ఉపఎన్నిక పరాకాష్ట కానున్నదని విమర్శలు ఉన్నాయి. రాజగోపాల్ రెడ్డి ని ఎవరు రాజీనామా చేయమని అడగలేదు . బీజేపీ డైరక్షన్ ప్రకారం ఆయన ముందుకు వెళ్ళుతున్నారు .దీంతో ఈ ఎన్నికను అన్ని రాజకీయపార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. నియోజకరర్గం ప్రధానంగా బీసీ సామాజికవర్గానికి చెందిన గౌడ్ సామాజికవర్గం ఓట్లు 35 వేలకు పైగా అతిపెద్ద సామాజికవర్గంగా ఉంది. తరవాత స్థానంలో ముదిరాజులు 33 వేలకు పైగా ఓట్లతో రెండవస్థానంలో ఉన్నారు . యాదవులు ,ఎరుకల,పద్మశాలి , లంబాడి , లాంటి సామాజికవర్గాలు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నాయి. ప్రత్యేకంగా ఎస్సీ మాదిగ సామాజికవర్గం 25650 ఓట్లు కలిగిఉంది. రెడ్డి సామాజికవర్గం ఓట్లు కేవలం 7690 మాత్రమే ఉన్నాయి.అయినప్పటికీ ఆ సామాజికవర్గాన్ని పోటీకి నిలబెట్టి సీటు గెలవటం ఇక్కడ ప్రధాన పార్టీలకు రివాజుగా మారింది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరగనున్న ఉప ఎన్నిక కావడంతో ఈ ఎన్నిక ప్రభావం భవిష్యత్తు ఎన్నికలపై ఉంటుందని భావిస్తున్న అన్ని రాజకీయ పార్టీలు ఎలాగైనా మునుగోడు నియోజకవర్గంలో తమ జెండా ఎగురవేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారో అప్పటినుండే రంగంలోకి దిగిన రాజకీయ పార్టీలు, సామాజిక వర్గాల వారీగా ఓటర్ల జాబితాను సేకరించి కసరత్తులు మొదలు పెట్టాయి.

సామాజిక వర్గాల వారీగా మునుగోడు నియోజకవర్గంలో ఓటుబ్యాంకు అధ్యయనం చేస్తున్న రాజకీయ పార్టీలు ఏ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు? ఎవరి ఓట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తాయి? బీసీల ఓట్లు ఎన్ని? ఎస్సీ ఎస్టీల ఓటుబ్యాంకు ఎంత? అభ్యర్థిగా ఎవరిని నిలబడితే తమ పార్టీ విజయం సాధిస్తుంది? ఏ కమ్యూనిటీకి నియోజకవర్గంలో ప్రాధాన్యత ఉంది? వంటి అనేక అంశాలపై కసరత్తు చేస్తున్నారు. ఇక మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు రెండు లక్షల ఇరవై వేల ఐదు వందల ఇరవై మంది ఉంటే కులాల వారీగా ఎంత మంది ఓటర్లు ఉన్నారు అన్న డేటాను సైతం సేకరించి పని మొదలుపెట్టారు.

మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా గౌడ కులస్తులు ఉన్నట్టు తెలుస్తుంది. మునుగోడు నియోజకవర్గంలో గౌడ కులస్తులు 35,150మంది 15.94% ఓటు షేర్ తో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో ముదిరాజులు 33, 900 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ముదిరాజు ఓటు పర్సంటేజ్ 15.3 7 శాతంగా ఉంది. ఇక మూడవ స్థానంలో ఎస్సీ మాదిగ కమ్యూనిటీ ఉన్నట్టుగా తెలుస్తోంది మునుగోడు నియోజకవర్గం లో ఎస్సీ మాదిగ ఓటర్లు 25 ,650 మంది ఉన్నారు. ఓటు శాతం 11.6 3 శాతం.

యాదవ కమ్యూనిటీకి సంబంధించిన ఓటర్లు 21, 360 మంది కాగా వారి ఓటు షేర్ 9.69 శాతంగా ఉంది. ఇక పద్మశాలీలు 11, 680 ఉన్నారు. వారి ఓటు శాతం 5.30 శాతంగా ఉంది. ఎస్టి లంబాడి ఎరుకల కులానికి చెందిన ఓటర్లు 10,520 మంది ఉన్నారు. వారి ఓటు శాతం 4.7 శాతంగా ఉంది ఇక ఎస్సీ మాల 10,350 మంది ఓటర్లు, వడ్డెర కమ్యూనిటీ చెందిన 8,350 ఓటర్లు, కుమ్మరి కమ్యూనిటీలో 7,850 మంది ఓటర్లు, విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ లో 7,820 ఓటర్లు, రెడ్డి కమ్యూనిటీ లో 7,690 మంది ఓటర్లు, ముస్లింలు 7,650 మంది, కమ్మ 5,680 మంది, ఆర్య వైశ్య కమ్యూనిటీ ఓటర్లు 3,760 మంది, వెలమ ఓటర్లు 2,360 మంది, మున్నూరు కాపు ఓటర్లు 2,350 మంది, ఇతరులు 18,400 మంది ఉన్నారు.

ఇక కులాల వారీగా ఓటు బ్యాంకు ను పరిశీలిస్తున్న ప్రధాన పార్టీల నాయకులు, ఏ కమ్యూనిటీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్నదానిపై అంచనా వేస్తున్నారు. ఆ కమ్యూనిటీ నుండి బలమైన నాయకుడు ఎన్నికల బరిలోకి దింపాలని ఎత్తుగడ వేస్తున్నారు. ఏది ఏమైనా సామాజిక సమీకరణాలను పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతనే అన్ని ప్రధాన పార్టీల నాయకులు ఈసారి మునుగోడు ఉప ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలిపే అవకాశం ఉంది.

Related posts

వైఎస్ హయాంలో ఉచిత విద్యుత్ ఘనత కాంగ్రెస్ దే: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…

Drukpadam

ఈటల నీ నిర్ణయం సమర్ధనీయం కాదు: తమ్మినేని…..

Drukpadam

హైద్రాబాద్ లో పవన్ …చంద్రబాబు భేటీ ఏపీ రాజకీయాలపై చర్చ …!

Drukpadam

Leave a Comment