Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ పార్టీకి నిన్న గులాంనబీ ఆజాద్ ,నేడు ఎంఏ ఖాన్ రాజీనామా!

కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ ఎంఏ ఖాన్ రాజీనామా!

  • హైద‌రాబాద్ కేంద్రంగా రాజ‌కీయాలు న‌డిపిన ఖాన్‌
  • విద్యార్థి ద‌శ నుంచే కాంగ్రెస్ పార్టీ నేత‌గా కొన‌సాగిన వైనం
  • కార్య‌క‌ర్త‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు పార్టీ దూర‌మైపోయింద‌ని ఆవేద‌న‌
  • రాజీనామా లేఖ‌ను సోనియా గాంధీకి పంపిన మాజీ ఎంపీ

నిన్న గులాంనబీ ఆజాద్ ,నేడు ఎం ఏ ఖాన్ గతంలో అనేకమంది కీలకనేతలు కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు . కాంగ్రెస్ అధికారంలో ఉండగా చెరువులో చేపల్లాగా ఉన్న నేతలు నేడు కాంగ్రెస్ బలహీనపడి కష్టకాలంలో ఉందని గుర్తించి ఎండిన చెరువులో జారిపోయిన చేపల్లా ఒకరొకరు చేజారుతున్నారు. ఒకపక్క బీజేపీ తోపాటు మరికొన్ని పార్టీలు కాంగ్రెస్ ను లేకుండా చేయాలనీ చూస్తున్నాయి. అధికారం లేకపోవడంతో ఇప్పటివరకు కాంగ్రెస్ లో ఉండి అనేక పదవులు అనుభవించిన నేతలు కాంగ్రెస్ ను వీడటంపై తీవ్ర చర్చ జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ లోని 23 మంది సీనియర్ నేతలు పార్టీపై తమ అసమ్మతిని తెలియజేస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియా కు లేఖ రాయడం సంచలనంగా మారింది. నాటి నుంచి అసమ్మతి గళం పెరుగుతూనే ఉంది. కపిల్ సిబల్ , ఆనంద్ శర్మ ,గులాంనబీ ఆజాద్ , ఎం ఏ ఖాన్ , లాంటి అనేకమంది సీనియర్ నేతలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పటం ,కాంగ్రెస్ పై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది . కాంగ్రెస్ లోని పెద్ద నేతలు పార్టీని బలహీన పరచడం ఆవకాశవాదానికి పరాకాష్టగా ఉండనే అభిప్రాయాలూ నెలకొన్నాయి.

జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు శ‌నివారం మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. పార్టీకి చెందిన కీల‌క నేత‌లు ఒక‌రి వెంట మ‌రొక‌రు పార్టీని వీడుతున్న నేప‌థ్యంలో శ‌నివారం తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ కేంద్రంగా రాజ‌కీయం నెర‌పుతున్న పార్టీ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు మ‌హ్మ‌ద్ అలీ ఖాన్ (ఎంఏ ఖాన్‌) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న రాజీనామా లేఖ‌ను పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీకి పంపారు.

హైద‌రాబాద్ రాజ‌కీయాల్లో కాంగ్రెస్ పేరు చెబితే… ఏంఏ ఖాన్ ప్ర‌స్తావ‌న లేకుండా చ‌ర్చ ముగియ‌ని ప‌రిస్థితి. ముస్లిం మైనారిటీల్లో పార్టీ త‌రఫున క్రియాశీల‌కంగా ప‌నిచేసిన నేత‌ల్లో ఖాన్ ఒక‌రు. ముస్లిం ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల్లో పార్టీకి మంచి ప‌ట్టును సాధించి పెట్టిన వారిలో ఖాన్ ఒక‌రుగా గుర్తింపు సంపాదించారు. విద్యార్థి ద‌శ నుంచే కాంగ్రెస్ వెంట న‌డిచిన ఖాన్‌… 4 ద‌శాబ్దాలుగా పార్టీలోనే కొన‌సాగారు.

పార్టీ కార్య‌కర్త‌ల‌తో పూర్తిగా సంబంధాలు తెంచేసుకున్న కాంగ్రెస్ పార్టీ ప్ర‌జ‌ల‌కూ దూరంగా జ‌రిగిపోయింద‌ని ఎంఏ ఖాన్ త‌న రాజీనామాలో పేర్కొన్నారు. పార్టీ అభ్యున్న‌తి కోసం సీనియ‌ర్లు ఇస్తున్న స‌ల‌హాల‌ను పార్టీ కీల‌క నేత‌లు అప‌హాస్యం చేస్తున్నార‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పార్టీ అధిష్ఠానం చుట్టూ చేరిన ఓ కోట‌రీ కీల‌క నేత‌లంద‌రినీ పార్టీకి దూరం చేస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. ఇలాంటి ప‌రిస్థితుల నేప‌థ్యంలో పార్టీకి రాజీనామా త‌ప్పించి త‌న‌కు మ‌రో ప్ర‌త్యామ్నాయం క‌నిపించ‌డం లేద‌ని ఖాన్ తెలిపారు.

Related posts

కోమటిరెడ్డి లో మార్పు రావడం సంతోషకరం …విహెచ్ ..

Drukpadam

జ‌ర్న‌లిస్టుల‌కు జాగ్వార్ కార్లిస్తే.. టీఆర్ఎస్‌లో చేర‌తానంటున్న జగ్గారెడ్డి!

Drukpadam

సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ కు నిరసన సెగ…!

Drukpadam

Leave a Comment