Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

ఆసియా కప్ క్రికెట్ లో పాక్ పై భారత్ ఆటతీరు అద్భుతం అంటూ ప్రధాని మోడీ ప్రశంశ !

ఆసియా కప్: పాకిస్థాన్‌పై భారత ప్రదర్శన అద్భుతమంటూ కొనియాడిన మోదీ!
-పాక్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్
-ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారన్న ప్రధాని
-గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించారంటూ అభినందనలు
-యావత్ భారతావని మురిసేలా… చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై టీమిండియా విక్టరీ
-ఆసియా కప్ లో దాయాదుల సమరం
-చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితం
-భారత్ దే పైచేయి
-5 వికెట్ల తేడాతో విజయం
-సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించిన హార్దిక్ పాండ్యా

ఆసియా కప్‌లో భాగంగా గత రాత్రి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. పాకిస్థాన్ నిర్దేశించిన 148 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో గతేడాది ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఎదురైన పరాభవానికి భారత్ బదులు తీర్చుకున్నట్టు అయింది.

పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన భారత జట్టుకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిందని కొనియాడారు. ప్రత్యర్థిపై గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించిన భారత జట్టుకు అభినందనలంటూ ట్వీట్ చేశారు.

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్ లో టీమిండియా చిరస్మరణీయ విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు సాగిన థ్రిల్లింగ్ మ్యాచ్ లో భారత్ దే పైచేయిగా నిలిచింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై విజయం సాధించింది. తద్వారా గతేడాది టీ20 వరల్డ్ కప్ లో పాక్ చేతిలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకుంది.

పాక్ నిర్దేశించిన 148 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలోనే ఛేదించింది. హార్దిక్ పాండ్యా చిచ్చరపిడుగులా చెలరేగాడు. పాండ్యా 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జడేజా 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లతో 35 పరుగులు చేశాడు.

అంతకుముందు, విరాట్ కోహ్లీ 35 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 18 పరుగులు చేశాడు. చివర్లో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోగా… రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా జోడీ ఆత్మవిశ్వాసంతో ఆడి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పింది.

ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 7 పరుగులు అవసరం కాగా, స్పిన్నర్ నవాజ్ బౌలింగ్ లో తొలి బంతికే జడేజా అవుటయ్యాడు. అయితే, హార్దిక్ పాండ్యా ఓ ఫ్లాట్ సిక్స్ తో మ్యాచ్ ను ముగించి టీమిండియా శిబిరంలో ఆనందోత్సాహాలు నింపాడు.

పాక్ బౌలర్లలో నసీమ్ షా 2, మహ్మద్ నవాజ్ 3 వికెట్లు తీశారు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అంటే అభిమానులు ఏమేం ఐటమ్స్ ఉండాలని కోరుకుంటారో అన్నీ లభించిన మ్యాచ్ ఇది. రోమాంఛక వినోదం, ఉత్కంఠ, క్రికెటింగ్ నైపుణ్యాలు, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రతిభ, చివరి ఓవర్ వరకు కొదమసింహాల్లా తలపడిన ఆటగాళ్ల పోరాట పటిమతో దాయాదుల సమరం తన ప్రత్యేకతను చాటింది.

Related posts

నాలుగో టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 191 ఆలౌట్

Drukpadam

టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ నియామకాన్ని నూతన శకంగా అభివర్ణించిన ఐసీసీ.. ఎవరెవరు ఏమన్నారంటే..?

Drukpadam

నన్ను కెప్టెన్ గా నియమిస్తారనుకున్నాను… మనసులో మాట బయటపెట్టిన యువరాజ్ సింగ్…

Drukpadam

Leave a Comment