Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బ్రెజిల్ లో ఆదివాసీ తెగ కనుమరుగు …ప్రకటించిన బ్రెజిల్!

బ్రెజిల్ లో ఆదివాసీ తెగ కనుమరుగు …ప్రకటించిన బ్రెజిల్!
-బ్రెజిల్ లోని ఆదివాసీ తెగకు చెందిన ఒకే ఒక్కడు… ఇక లేడు!
-టనారు ప్రాంతంలో అరుదైన ఆదివాసీ తెగ
-గత 26 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తి
-ఇటీవల విగతజీవుడిగా దర్శనం
-అంతరించిపోయిన ఆదివాసీ తెగ
-అధికారికంగా ప్రకటించిన బ్రెజిల్ ప్రభుత్వం

ఆదివాసీలు …అడవుల్లో తిరుగుతూ , ఆకులూ అలమలు, తింటూ నిత్యం బ్రతుకు పోరాటం చేస్తున్న వారిని ఆదివాసీలు అంటాం… ఇప్పటికి ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఆదివాసీలు అడవుల్లో నివసిస్తూ అటవీ జంతువులతో పోరాడుతూ జీవనం సాగితుస్తున్నారు .వారిని .ఆదిమానవులు అనికూడా అంటారు . ఇప్పటికి ప్రపంచంలో అనేక దేశాల్లో వారు నాగరిక ప్రపంచానికి దూరంగా బ్రతుకు పోరాటం సాగిస్తున్నారు . అయితే దక్షణ అమెరికా లోని బ్రెజిల్ అనే దేశంలో చివర ఆదిమానవుడి కన్నుమూశాడు . ఈ వార్తను ఆదేశం అధికారికంగా ప్రకటించింది.ప్రపంచంలోనే అత్యధిక అడవులు ఉన్న దేశం . అమెజాన్ అడవులు ఇక్కడే ఉన్నాయి.

బ్రెజిల్ లోని టనారు ఆదివాసీ తెగ అంతరించిపోయింది. తెగలోని చివరి వ్యక్తి కూడా ఇటీవలే మరణించాడు. ఆ వ్యక్తి గత 26 ఏళ్లుగా ఒక్కడే జీవిస్తున్నాడు. 70వ దశకంలో రోండోనియా రాష్ట్రంలోని టనారు ఆదివాసీ ప్రాంతానికి చెందిన వారిని భూస్వాములు పొట్టనబెట్టుకున్నారు. అటవీభూముల్లో తమ పాలాలను విస్తరించుకునేందుకు ఆ అరుదైన తెగకు చెందిన వారిని బలిగొన్నారు.

ఆ తర్వాత 1995లో అక్రమ గనుల తవ్వకందారులు ఈ తెగకు చెందిన మరికొందరిని చంపేశారు. దాంతో ఆ తెగలో ఒకే ఒక్క వ్యక్తి మిగిలాడు. దాంతో, అతడు ఉండే ప్రాంతాన్ని బ్రెజిల్ ప్రభుత్వం ఇతరులకు నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించింది.

కాగా, అతడు గోతులు తవ్వి వాటిలో పడే జంతువులను ఆహారంగా తీసుకుంటాడు. అందుకే అతడిని బ్రెజిల్ లో ‘మ్యాన్ ఆఫ్ హోల్’ అని పిలుస్తారు. అతడి పేరేమిటో ఎవరికీ తెలియదు. కాగా, అతడు సంచరించే ప్రాంతాలను బ్రెజిల్ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తుంటారు.

ఎప్పట్లానే రోజువారీ పరిశీలన చేపట్టిన ఓ ఉద్యోగికి ఆ ఆదివాసీ వ్యక్తి విగతజీవుడిలా దర్శనమిచ్చాడు. తనకు మరణం ఆసన్నమైందని తెలుసుకున్న ఆ వ్యక్తి శరీరంపై ఈకలు కప్పుకుని ఉండడం దర్శనమిచ్చింది. అతడి వయసు 60 ఏళ్లు ఉండొచ్చని అంచనా వేశారు. అతడి మరణాన్ని బ్రెజిల్ ప్రభుత్వం నిర్ధారించింది.

Related posts

మీడియా రంగాన్ని రక్షించుకోకపోతే ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతుంది..ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది రాకేశ్ కన్నా

Ram Narayana

అమెరికాలో టిక్‌టాక్‌, వీచాట్‌ డౌన్‌లోడ్ల నిలిపివేత ఉత్తర్వుల ఉపసంహరణ!

Drukpadam

కరోనా ఎఫెక్ట్.. శ్రీశైలం లో ఆగిన మల్లన్న సర్వదర్శనం ….

Drukpadam

Leave a Comment