Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కార బాధ్యత కేంద్ర హోం శాఖదే :వినోద్

రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కార బాధ్యత కేంద్ర హోం శాఖదే

కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలో వచ్చే విషయం కాదు ఇదీ

ఏపీ విభజన చట్టం నిబంధనలు చెబుతున్నది ఇదే

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల అంశంపై హోం శాఖ చొరవ చూపాలి

ఏపీ విద్యుత్ సంస్థలే తెలంగాణకు బాకీ ఉన్నాయి

## రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

విద్యుత్ బకాయిల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల విషయంలో కేంద్ర హోంశాఖ మాత్రమే జోక్యం చేసుకొని పరిష్కార మార్గాన్ని కనుగొనాలి తప్ప కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కాదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం రాష్ట్రాల మధ్య వివాదాలు ఏమైనా ఉంటే కేంద్ర హోంశాఖ చొరవ తీసుకొని వాటి పరిష్కారానికి మార్గాలు చూపాల్సిన బాధ్యత ఉంటుందని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయల అంశంలో కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం ఏ మాత్రం సహేతుకం కాదని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల విషయంలో రెండు వైపులా వాదనలు విన్న తర్వాతే కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకోవాల్సింది పోయి కేవలం ఆంధ్రప్రదేశ్ వాదనలను మాత్రమే సమర్థించి నెలరోజుల్లోగా విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని, ఇది ముమ్మాటికీ తప్పితమే అవుతుందని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంటుందని, కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న విద్యుత్ బకాయిల విషయంలో మాత్రం మౌనంగా ఉండడం తగదని వినోద్ కుమార్ అన్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య క్లేమ్స్ అండ్ కౌంటర్ క్లేమ్స్ పట్టించుకోకపోవడం చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచన విధానం తెలంగాణకు తీరని అన్యాయం చేసే కోణంలోనే ఉందని స్పష్టమవుతుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

విద్యుత్ బకాయిల అంశంలో విభజన చట్టం మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మాత్రమే జోక్యం చేసుకొని సామరస్యంగా సమస్యను పరిష్కరించే విధంగా చొరవ చూపాల్సి ఉంటుందని వినోద్ కుమార్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ విద్యుత్ సంస్థలకు రూ. 12,940 కోట్లు బకాయి పడి ఉందని అధికారులు లెక్కలు చెబుతుండగా, వాటిని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పట్టించుకోకపోవడం , కేవలం ఆంధ్రప్రదేశ్ కు వాదనలను మాత్రమే వినడం సరైన పద్దతి కాదని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

విద్యుత్ బకాయిల విషయంలో ఏపీ జెన్ కో సంస్థ తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉపసంహరించుకుందని వినోద్ కుమార్ గుర్తు చేశారు. ఏపీ జెన్ కో విధానాన్ని నిరసిస్తూ టీ.ఎస్. జెన్ కో అండ్ టీ.ఎస్. డిస్కం సంస్థలు రాష్ట్ర హై కోర్టులో రిట్ పిటిషన్లు వేశాయని కూడా వినోద్ కుమార్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తొలి రోజుల్లో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన చట్టాన్ని ఉల్లంఘించి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేయకుండా అడ్డుకున్నారని, అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ధరకు ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ ను కొనుగోలు చేయాల్సి వచ్చిందని వినోద్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Related posts

మోడీకి మమతాబెనర్జీ గుడ్ సర్టిఫికెట్ …

Drukpadam

మానుకోటలో రాళ్లు విసిరిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవా?: సీఎం కేసీఆర్​ పై ఈటల రాజేందర్​ హాట్ కామెంట్స్!

Drukpadam

ద‌ళితుల‌కు రూ.10 ల‌క్ష‌లు ఇచ్చిన మ‌గాడు దేశంలో ఉన్నాడా?: కేటీఆర్‌

Drukpadam

Leave a Comment