Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సోవియెట్ యూనియన్ చివరి అధినేత మిఖాయిల్ గోర్బచెవ్ కన్నుమూత!

సోవియెట్ యూనియన్ చివరి అధినేత మిఖాయిల్ గోర్బచెవ్ కన్నుమూత!
-ప్రచ్ఛన్న యుద్ధాన్ని నివారించడంలో కీలక పాత్ర పోషించిన గోర్బచెవ్
-దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన యూఎస్సెస్సార్ చివరి అధ్యక్షుడు
-జర్మనీ పునరేకీకరణకు పాటుపడిన నాయకుడు
-సంతాపం తెలిపిన ప్రపంచ నాయకులు

చరిత్ర గతిని మార్చిన ఒక దిగ్గజం నేలను విడిచింది. పశ్చిమ దేశాల్లో సంస్కరణల రూపకర్తగా పేరు గడించిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మిఖాయిల్ గోర్బచెవ్ కన్నుమూశారు. ప్రచ్ఛన్న యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టిన సోవియెట్ యూనియన్ చివరి అధినేతగా చరిత్రకెక్కిన ఆయన 91 ఏళ్ల వయసులో గత రాత్రి కన్నుమూశారు. ప్రచ్ఛన్న యుద్ధాన్ని నివారించడంలో గోర్బచెవ్ విజయం సాధించినప్పటికీ సోవియెట్ యూనియన్ పతనాన్ని మాత్రం ఆపలేకపోయారు. ఆ తర్వాతే రష్యా ఏర్పడింది. పేరిస్త్రోయిక ,గ్లాస్ నోస్తూ విధానాలతో సోవియట్ యూనియన్ విచ్చిన్నానికి ఆయన కారణమైయ్యాడనే విమర్శలుకూడా మూటగట్టుకున్న గర్బచోవ్ మరణం ప్రపంచంలోని పలు దేశాల అధినేతలు సంతాపం ప్రకటించారు .

ఐరోపాను విభజించిన ఇనుప తెరను తొలగించి జర్మనీ పునరేకీకరణకు గోర్బచెవ్ పాటుపడ్డారు. అమెరికా, పాశ్చాత్య దేశాలతో ఆయుధ నియంత్రణ ఒప్పందాలను కుదుర్చుకున్న గోర్బచెవ్.. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ గత రాత్రి కన్నుమూసినట్టు రష్యా సెంట్రల్ క్లినికల్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

గోర్బచెవ్ మృతికి ప్రపంచవ్యాప్తంగా పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఆయన మృతికి సంతాపం తెలిపినట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ టెలిగ్రామ్ మెసేజ్ పంపనున్నట్టు చెప్పారు. గోర్బచెవ్ చరిత్ర గమనాన్ని మార్చిన గొప్ప నాయకుడని ఐక్యరాజ్య సమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ కొనియాడారు. విలక్షణమైన నాయకుడని ట్వీట్ చేశారు. స్వేచ్ఛాయుత యూరప్‌కు దారులు తెరిచిన గౌరవప్రదమైన నాయకుడంటూ యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లేయన్ పేర్కొన్నారు. గోర్బచెవ్ ధైర్యం, సమగ్రత ప్రశంసనీయమని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు.

Related posts

రైతు ఉద్యమం నేపథ్యం లో కేంద్రంపై సుప్రీం సీరియస్

Drukpadam

3 Skincare Products You Need to Bring the Spa Home

Drukpadam

కారు ప్రయాణం మరింత సురక్షితం!.. త్వరలోనే ప్రతి కారులో ఆరు ఎయిర్ బ్యాగులు!

Drukpadam

Leave a Comment