Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో యాంఫీ థియేటర్ నిర్మాణంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అసంతృప్తి! 

శ్రీశైలంలో పర్యటించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి… యాంఫీ థియేటర్ నిర్మాణంపై అసంతృప్తి! 

  • వినాయచవితి నాడు శ్రీశైల క్షేత్రాన్ని దర్శించిన కిషన్ రెడ్డి
  • కుటుంబసమేతంగా భ్రమరాంబ మల్లికార్జునస్వామి దర్శనం
  • ఆలయానికి దూరంగా యాంఫీ థియేటర్ నిర్మాణం
  • భక్తులు ఎలా వస్తారన్న కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గణేశ్ చతుర్థి పర్వదినం సందర్భంగా ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం విచ్చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడి భ్రమరాంబ మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్నారు. ఇక్కడ అనేక పూజా క్రతువులు ఆచరించారు. ఆలయ ఆవరణలో గోమాతను భక్తిప్రపత్తులతో సేవించుకున్నారు.
ఇక శ్రీశైలంలో ఏర్పాటు చేస్తున్న యాంఫీ థియేటర్ నిర్మాణం పట్ల కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్నారంటూ అసహనం వెలిబుచ్చారు. ఆలయానికి దూరంగా యాంఫీ థియేటర్ నిర్మాణం ఏంటని అధికారులను ప్రశ్నించారు. యాంఫీ థియేటర్ కు భక్తులు ఎలా వస్తారని అన్నారు. కాగా, యాంఫీ థియేటర్ నిర్మాణానికి రూ.7.99 కోట్లు ఖర్చయినట్టు తెలుస్తోంది.

Related posts

Meet the Nokia 8 — The First Android Flagship From The Iconic Brand

Drukpadam

తల్లిని గుర్తు చేసుకొని తల్లడిల్లిన సోనూసూద్…

Drukpadam

ఏపీలో మల్లి ఎన్నికల గంట మోగింది: మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు!

Drukpadam

Leave a Comment