Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీఆర్ యస్ మీడియా సంస్థల ప్రతినిధులపై బీజేపీ నిషేధం ….

bjp asks some journalists to leave the nirmala sitharaman press meet

 

టీఆర్ యస్ మీడియా సంస్థల ప్రతినిధులపై బీజేపీ గుర్రు ….
నిర్మ‌ల మీడియా స‌మావేశం నుంచి ప‌లువురు జ‌ర్న‌లిస్టుల‌ను పంపేసిన బీజేపీ
హైద‌రాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో నిర్మ‌ల మీడియా స‌మావేశం
టీ న్యూస్‌, తెలంగాణ టుడే, న‌మ‌స్తే తెలంగాణ విలేక‌రుల‌ను పంపేసిన బీజేపీ
అందుకు గ‌ల కార‌ణాన్ని కూడా వెల్ల‌డించిన బండి సంజ‌య్‌

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తనకు ఇష్టం లేకపోతె ఎలాంటి చర్యలకైనా సిద్దపడుతుందనేందుకు హైద్రాబాద్ లో నిర్వహించిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ మీడియా సమావేశమే సాక్షి భూతంగా నిలుస్తుంది.శనివారం హైద్రాబాద్ బీజేపీ కార్యాలయంలో నిర్మల సీతారామన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు . దానికి అన్ని మీడియా సంస్థల ప్రతినిధులు హాజరైయ్యారు. ఆమె మీడియా ను ఉద్దేశించి మాట్లాడేందుకు మరికొద్ది నిమిషాల్లో రానున్నారనగా అక్కడకు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ టీఆర్ యస్ కు చెందిన మీడియా సంస్థల ప్రతినిధులను బయటకు వెళ్లాలని కోరారు . దీంతో అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా అవాక్కు అయ్యారు . చేసేది లేక వారు బయటకు వెళ్లి పోయారు .

తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ శ‌నివారం మ‌ధ్యాహ్నం త‌న ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని ఢిల్లీకి తిరుగు ప్ర‌యాణంలో భాగంగా హైద‌రాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడారు. ఈ మీడియా స‌మావేశానికి దాదాపుగా అన్ని ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియా సంస్థ‌ల‌కు చెందిన ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా మ‌రికాసేప‌ట్లో మీడియా స‌మావేశానికి నిర్మ‌లా సీతారామ‌న్ రానున్నార‌న‌గా… ప‌లు మీడియా సంస్థ‌ల‌కు చెందిన జ‌ర్న‌లిస్టుల‌ను బీజేపీ నేత‌లు అక్క‌డి నుంచి పంపించి వేశారు. ఇలా నిర్మ‌ల మీడియా సమావేశం నుంచి పంపేసిన జ‌ర్న‌లిస్టుల్లో టీ న్యూస్ ఛానెల్‌, తెలంగాణ టుడే, న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక విలేక‌రులు ఉన్నారు. ఇదే విష‌యాన్ని నిర్మ‌ల మీడియా స‌మావేశంలో పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కూడా ప్ర‌క‌టించారు. అన‌వ‌స‌ర రాద్ధాంతం చేయ‌డంతో పాటుగా పొంతన లేని ప్ర‌శ్న‌ల‌తో విసిగించే కొన్ని మీడియా సంస్థ‌ల‌కు చెందిన విలేక‌రుల‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగానే వెళ్లిపోవాలని చెప్పిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

 

ప్ర‌తి ప‌థ‌కంలోనూ కేంద్రం వాటా ఉంది: నిర్మ‌లా సీతారామ‌న్‌

union minister nirmala sitharaman states that central funds in state schemes
దేశంలోని ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్న అన్ని ప‌థ‌కాల్లోనూ కేంద్ర ప్ర‌భుత్వ వాటా ఉంటుంద‌ని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అన్నారు. జ‌హీరాబాద్ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన నిర్మల‌… గ‌డ‌చిన మూడు రోజులుగా నియోజ‌క‌వ‌ర్గంలోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని ఢిల్లీ తిరిగి వెళుతున్న సంద‌ర్భంగా హైద‌రాబాద్ వ‌చ్చిన ఆమె న‌గ‌రంలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడారు.

రాష్ట్రాలు అమ‌లు చేసే ప‌థ‌కాల్లో 60 శాతం వాటా కేంద్రానిదేన‌న్న నిర్మ‌ల‌… కేవ‌లం 40 శాతం నిధుల‌ను మాత్రమే రాష్ట్ర ప్ర‌భుత్వాలు భ‌రిస్తున్నాయ‌ని తెలిపారు. అలాంట‌ప్పుడు ఆయా ప‌థ‌కాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం పెట్టిన పేర్ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎలా తొల‌గిస్తాయ‌ని ఆమె ప్ర‌శ్నించారు. ఆయా ప‌థ‌కాల‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వ లొగోల‌ను, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఫొటోల‌ను ఎందుకు వినియోగించ‌ర‌ని ఆమె ప్ర‌శ్నించారు. అన్ని ప‌థ‌కాల‌కు కేంద్రం నిధులు ఇస్తున్నందున… ఆ నిధులు ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా డిజిట‌లైజేష‌న్ చేశామ‌ని నిర్మ‌ల చెప్పారు.

Related posts

సోము వీర్రాజును ఇకపై ‘సారాయి వీర్రాజు’ అని పిలవాలేమో…సీపీఐ రామకృష్ణ!

Drukpadam

పొంగులేటి ,జూపల్లి నివాసాలకు కాంగ్రెస్ నేతలు రేవంత్, కోమటిరెడ్డి…

Drukpadam

పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్ ప్రయాణమెటు …?

Drukpadam

Leave a Comment