Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కృష్ణయ్య హత్య తో సిపిఎం కు సంబంధం లేదంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని…

కృష్ణయ్య హత్య తో సిపిఎం కు సంబంధం లేదంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని…
-మునుగోడుతో లింక్ పెట్టడం పై తీవ్ర అభ్యంతరం
-బీజేపీ రాష్ట్రంలో అడుగు పెట్టకూడదనే టీఆర్ యస్ కు మద్దతు
-మునుగోడు ఎన్నికలవరకే టీఆర్ యస్ కు మద్దతు
-ప్రజాసమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంకంగా మా యుద్ధం ఆగదు

రాష్ట్రంలోనే అంత్యంత సంచలనం సృష్టించిన ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి కి చెందిన తమ్మినేని కృష్ణయ్య హత్య కేసుకు తమకు ఎలాంటి సంబంధం లేదని సిపిఎం బలంగా బల్లగుద్ది మరి వాదిస్తుంది. మునుగోడు ఉపఎన్నికల్లో అధికార టీఆర్ యస్ కు మద్దతు ప్రకటించిన సిపిఎం నేతలు తర్వాత మీడియా తో మాట్లాడారు . సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నాయకత్వంలో చెరుపల్లి సీతారాములు , జూలకంటి రంగారెడ్డి ల బృందం సీఎం కేసీఆర్ ను కలిసిన విషయం విదితమే . తెల్దారుపల్లి లో కృష్ణయ్య ను తమ పార్టీ కార్యకర్తలు హత్య చేశారని ఇందుకు సిపిఎం భాద్యత వహించాలని చెప్పటం సరికాదని తమ్మినేని వీరభద్రం అన్నారు .హత్యను తమపార్టీ తీవ్రంగా ఖండించిన విషయాన్నీ గుర్తు చేశారు . తెల్దారుపల్లి గ్రామం మొదటినుంచి సిపిఎం కంచుకోట . తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో జాగిర్దార్ కు వ్యతిరేకంగా రైతుల పక్షాన , తమ్మినేని సుబ్బయ్య నాయకత్వంలో పోరాడిన చరిత్ర గ్రామానికి ఉందని అన్నారు . హత్య రాజకీయాలకు సిపిఎం వ్యతిరేకం అన్నారు . కొందరు మునుగోడుకు ఉపఎన్నికకు కృష్ణయ్య హత్యకు లింక్ పెట్టడంపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు . సిపిఎం కు కొన్ని కచ్చితమైన విధానాలు ఉన్నాయి . అందులో భాగంగానే రాష్ట్రంలో మతతత్వ బీజేపీ రాకూడదనే ఉద్దేశ్యంతోనే బీజేపీ ని ఓడించగలిగిన టీఆర్ యస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు . ఈ విషయాలన్నీ తమ పార్టీ కేంద్ర నాయకత్వం ఆమోదంతోనే జరుగుతాయని అంతకు ముందు రాష్ట్ర కమిటీ లో చర్చజరిగింది తర్వాతనే పార్టీ నిర్ణయం , కేంద్ర కమిటీ ఆమోదం జరుగుతుందని తమ్మినేని వివరించారు .

మునుగోడు ఎన్నికలవరకే తమ పార్టీ టీఆర్ యస్ కు మద్దతు ఇస్తుందని అదికూడా బీజేపీ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా ఉండేందుకేనని స్పష్టం చేశారు . ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసినప్పుడు ప్రజాసమస్యలపై ఒక మెమోరాండం ఇవ్వడం జరిగిందని అన్నారు . ప్రజల సమస్యల పరిస్కారం కోసం అధికార టీఆర్ యస్ పై తమ యుద్ధం కొనసాగుతుందని పేర్కొన్నారు . తమ పార్టీ పై నిరాధార నిందారోపణలు చేయడం తగదని అన్నారు .

Related posts

28 కి .మీ ప్రయాణానికి సీఎం జగన్ హెకాఫ్టర్ ఉపయోగించడంపై జనసేన నేత నాదెండ్ల విమర్శలు …

Drukpadam

చంద్రబాబు, పవన్ భేటీపై వైసీపీ నేతల విమర్శలు… సోమిరెడ్డి కౌంటర్!

Drukpadam

లకింపుర్ ఘటనకు భాద్యత వహిస్తూ కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా ?

Drukpadam

Leave a Comment