Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేయడం వల్లే బీజేపీ సంఖ్య పెరిగింది.. అమిత్ షాపై సీపీఎం ఫైర్!

ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేయడం వల్లే బీజేపీ సంఖ్య పెరిగింది.. అమిత్ షాపై సీపీఎం ఫైర్!

  • కేరళలో వచ్చే ఎన్నికల్లో కమలం వికసిస్తుందన్న అమిత్ షా వ్యాఖ్యలపై విమర్శ
  • కేరళలో గతంలో ఉన్న ఒక్క కమలం కూడా వాడిపోయిందని ఎద్దేవా
  • అమిత్ షా పగటి కలలు కంటున్నారని వ్యాఖ్య

బీజేపీ ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనుగోలు చేయడం ద్వారా మాత్రమే తమ సంఖ్యను పెంచుకుందని.. ఆ పార్టీ అవినీతిమయమని సీపీఎం మండిపడింది. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు అంతరించిపోయే దశలో ఉన్నాయని.. దేశంలో బీజేపీదే భవిష్యత్తు అంటూ అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడింది. ప్రతిపక్షాల నుంచి మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలను కొనడం బీజేపీకి పరిపాటి అయిపోయిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి ఎంఏ బేబీ ఆరోపించారు. బీజేపీ అవినీతి రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.

ఆ ఒక్కటీ వాడిపోయింది..
2016లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓట్ల సాయంతో బీజేపీ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకుందని ఎంఏ బేబీ గుర్తు చేశారు. ఆ తర్వాత 2021లో జరిగిన ఎన్నికల్లో ఆ ఒక్క స్థానాన్ని కూడా కోల్పోయిందని చెప్పారు. గతంలో కేరళలో వికసించిన ఒక్క కమలం కూడా కుళ్లిపోయిందని, ఈ విషయం అమిత్ షా మర్చిపోయారా అని ప్రశ్నించారు. కేరళలో బీజేపీ పరిస్థితి ఇలా ఉంటే.. కమలం వికసిస్తుందంటూ అమిత్‌ షా పగటి కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు.

Related posts

ఆఫ్ఘన్ లో మహిళల విద్యపై కీలక నిర్ణయం… అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన తాలిబన్లు!

Drukpadam

20 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత …మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

మోదీకి నితీశ్ పాదాభివంద‌నం!.. తప్పేముంద‌న్న జేడీయూ!

Drukpadam

Leave a Comment