Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీ లిక్కర్ స్కాం తో తెలుగు రాష్ట్రాలకు సంబంధం ఉందా?

ఢిల్లీ లిక్కర్ స్కాం తో తెలుగు రాష్ట్రాలకు సంబంధం ఉందా?
-టీడీపీ , బీజేపీ నేతల ఆరోపణల్లో నిజమెంత ?
-త్వరలో సిబిఐ చార్జీషీట్ వేస్తుందని దాంతో తాడేపల్లి పునాదులు -కదులుతాయని ఎలా చెప్పగలరు
-అందుకే జగన్ ఢిల్లీ పర్యటనలు చేస్తే తాడేపల్లి పునాదులు ఎలా కదులుతాయి ?

ఢిల్లీ లిక్కర్ స్కాం తో తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీ నేతలకు లేదా వారి బందువులకు సంబంధం ఉందని తెలుగు దేశం నేతలు ఆరోపించడం పై రోత,అసహ్యం పుడుతుంది. చేసే ఆరోపణలు సరిగా లేకపోతె ప్రజల్లో పలచబడి పోతామన్న కనీస పరిజ్ఙానం లేకపోవడం శోచనీయమనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. మొదట టీఆర్ యస్ కు చెందిన సీఎం కుమార్తె కల్వకుంట్ల కవిత పై ఆరోపణలు వచ్చాయి. దాన్ని ఇక్కడ బీజేపీ తమకు అనుకూలంగా చాటింపు చేసుకునేందుకు ప్రయత్నించింది. కానీ ఎందుకో ఆమె వచ్చిన ఆరోపణలను ప్రజలు అంతగా పట్టించుకోలేదు. పైగా అందులో నిజమెంత అనే కోణంలోనే ఆలోచనలు జరుగుతున్నాయి. ఇప్పుడు లిక్కర్ స్కాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై కేంద్రీకృతం అయింది. ఇక్కడ కూడా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి , సీఎం సతీమణి భారతిపైన టీడీపీ ఆరోపణలు గుప్పించడం మొదలు పెట్టింది . వారిద్దరూ లిక్కర్ స్కాం లో ఉన్నారని త్వరలోనే సిబిఐ వారిపై చార్జిషీట్ వేస్తుందని దీంతో తాడేపల్లి పునాదులు కదులుతాయని టీడీపీకి చెందిన పంచవర్తి అనురాధ చెప్పటం విడ్డురంగా ఉండనే అభిప్రాయాలూ ఉన్నాయి. ఆమె ఏమన్నారో చూద్దాం …..

 

త్వరలో సీబీఐ వేసే ఛార్జ్ షీట్ తో తాడేపల్లి పునాదులు కదులుతాయి: పంచుమర్తి అనురాధ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వైఎస్ భారతి, విజయసాయిరెడ్డి ప్రమేయం ఉందన్న అనురాధ
తన వాళ్లను కాపాడుకునేందుకే జగన్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని వ్యాఖ్య
లిక్కర్ స్కామ్ లో ఎవరి పాత్ర ఏమిటనే విషయాన్ని కేంద్రం తేల్చాలని డిమాండ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో సీఎం జగన్ భార్య వైఎస్ భారతి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలపై టీడీపీ నేత పంచుమర్తి అనురాధ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వీరిద్దరి పాత్ర ఉందని ఆమె అన్నారు. త్వరలో సీబీఐ వేసే ఛార్జిషీట్లతో తాడేపల్లి పునాదులు కదులుతాయని ఆమె చెప్పారు.

లిక్కర్ స్కామ్ లో జగన్ అవినీతిని వెల్లడించినందుకే టీడీపీపై కక్ష కట్టారని అన్నారు. ఈ కారణంగానే చంద్రబాబు కుటుంబంపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని… నారా భువనేశ్వరి, బ్రహ్మణిలపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. లిక్కర్ స్కామ్ నుంచి తన వాళ్లను కాపాడుకునేందుకే జగన్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎవరి పాత్ర ఏమిటనే విషయాన్ని కేంద్రం వెంటనే తేల్చాలని ఆమె డిమాండ్ చేశారు.

Related posts

తరిగిపోతున్న వేప సంపద.. ఎకరాకు 20 చెట్లున్నా.. రూ.15 వేల ఆదాయం!

Drukpadam

ఆసియాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ… న్యూయార్క్ నడి వీధిలో వృద్ధురాలిపై దాడి

Drukpadam

విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రికి సీబీఐ నోటీసులు…

Drukpadam

Leave a Comment