Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నా రాజకీయ జీవితంలో ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత చూడలేదు… చంద్రబాబు

నా రాజకీయ జీవితంలో ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత చూడలేదు… చంద్రబాబు
-బాగా తాగిన డ్రైవర్ బస్ నడిపినట్లుగా ఉంది జగన్ రెడ్డి చేతిలో పాలన
-కళ్ళు నెత్తికెక్కాయి …తిరుపతి ఎన్నికతో అవి కిందికి దిగిరావాలి
– లేక పొతే ప్రభుత్వం మీద తిరుగుబాటు ఖాయం
-వివేకానందరెడ్డి కేసులో కట్టప్ప ఎవరు ?
-ముఖ్యమంత్రి తమ్ముడు , ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయ్ హత్య జరిగితే దోషులు ఎవరనేది తేలక పోవడం పెద్ద మిస్టరీనే
-ఇది సిబిఐ కి కూడా ఛాలంజ్
నా రాజకీయజీవితంలో ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఎన్నడూ చూడలేదని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.కళ్ళు నెత్తికెక్కిన ప్రభుత్వం కాళ్లు నేలకు దిగిరావాలంటే ఇది మంచి అవకాశమని దీన్ని జారవిడుచుకోవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పంచాయతీలో గెలిచినా , మున్సిపాలిటీలలో గెలిచినా , జడ్పీ ఎంపీటీసీ ఎన్నికలలో మేము పోటీకి దూరంగా ఉన్నా, ప్రభుత్వంలో మార్పులేదని అహంకారంతో ,తలబిరుసు తో పరిపాలన సాగుతుందని మండిపడ్డారు . తిరుపతి ఓటర్లు ఒక చూపు చూస్తే ఈ ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తుందని అన్నారు. భయపెట్టి , బెదిరించి , రాజకీయాలు చేస్తే తిరుగుబాటు తప్పదని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫుల్ గా తగిన వ్యక్తి బస్ నడిపినట్లుగా జగన్ చేతిలో రాష్ట్ర పాలనా ఉందని అన్నారు. కేంద్రాన్ని చుస్తే గడగడా లాడతాడని ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదని పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి తమ్ముడు ,ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయ్ వై యస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే ఇంతవరకు కట్టప్ప ఎవరనేది తెలుసుకోలేక పోయారని అసలు కట్టప్ప ఎవరో ముఖ్యమంత్రికి తెలుసునని ఆరోపించారు. వివేకా కూతురుకూడా సిబిఐ దగ్గర ఫిర్యాదు చేసిందని ఈ కేసులో ఉన్నా సాక్షులు అందరు చనిపోతున్నారని ఇందులో ఎదో మిస్టరీ ఉందని అన్నారు. అసలు వివేకానంద రెడ్డి బాడీని ముందుగా ఎవరు చూశారు.ఎవరు కట్టలు కట్టారు అన్ని క్లియర్ గా ఉన్నాయని అయిన మిస్టరీ విడటంలేదని అన్నారు. స్వయంగా వివేకా కూతురు,వాళ్ళ పార్టీ ఎంపీ కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. సి బి ఐ కి కూడా ఈ కేసు ఒక ఛాలంజ్ లాంటిదని అన్నారు. పరిటాల రవి హత్య కూడా విదే విధంగా జరిగిందని అన్నారు.రాష్ట్రంలో రాక్షస పాలనా సాగుతుందని దీన్ని అరికట్టాలంటే చెతన్యమంతమైన ఓటర్లు ఆలోచించాలన్నాడు . ఈ ఎన్నికతో తాను ముఖ్యమంత్రి ని కానని కాని ప్రజల వ్యతిరేకత ను తెలియజేసే ఆయుధం ఓటు అని రాజ్యాంగ నిర్మాత బి ఆర్ అంబెడ్కర్ చెప్పిన మాటలను ఆయన ఉదహరించారు.

Related posts

నిర్బంధాల మధ్యనే కొనసాగుతున్న రైతుల ఉద్యమం

Drukpadam

ఎన్డీఏ ఉప‌రాష్ట్రప‌తి అభ్య‌ర్థి రేసులో న‌ఖ్వీ? కేంద్రమంత్రి పదవికి రాజీనామా!

Drukpadam

నీటి ప్రాజక్టుల విషయంలో భట్టి నిజాలు తెలుసుకొని మాట్లాడాలి :మంత్రి పువ్వాడ…

Drukpadam

Leave a Comment