Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ తప్పటడుగులు వేయబోతున్నారా?

పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ తప్పటడుగులు వేయబోతున్నారా?
-టీఆర్ యస్ తో తన ప్రయాణం సాధ్యం కాదని భావిస్తున్నారా ?
-అనుయాయులను రక్షించుకునేందుకు ఆయన వెతుకుంటున్న దారి ఏది ?
-టీఆర్ యస్ లో ఉంటూనే స్వతంత్రంగా వ్యహరించడం పై అధినేతకు నచ్చడం లేదా ?
-జిల్లా పర్యటనలో అనుయాయులకు ఇస్తున్న సంకేతాలు ఏమిటి ?
-తొందర పడద్దు దేవుడు అన్ని చూసుకుంటాడు …త్వరలోనే మంచి రోజులు -వస్తాయని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి ?

పొంగులేటి శ్రీనివాసరెడ్డి ….ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ … ఆనతి కాలంలోనే రాజకీయాల్లో తనకంటూ ప్రజల్లో బలమైన ముద్ర వేసుకున్న నాయకుడు …పదవి లేకపోయినా టీఆర్ యస్ తో ప్రయాణం అని చెప్పిన నేత రాజకీయంగా తప్పటడుగులు వేయబోతున్నారా ? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పండితులు … టీఆర్ యస్ తో తమ ప్రయాణం సాధ్యం కాదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నారు అందుకే త్వరలోనే మంచి జరుగుతుందని , దేవుడు అంతా మంచే చేస్తారని తొందరపడొద్దని తన అనుయాయులకు సంకేతం పంపారు . టీఆర్ యస్ లో స్వతంత్రంగా వ్యవహరించడం అధినేత కేసీఆర్ కు అస్సలు నచ్చలేదు . అందుకే బలమైన నాయకుడిగా ఉన్న ఆయనకు ఏ పదవి లేకుండా చేశారని ఆయన అనుయాయులు గుర్రుగా ఉన్నారు .

వైయస్సార్ కాంగ్రెస్ నుంచి 2014 లో ఎంపీ గా ఎన్నిక కావడమే కాకుండా ఆ పార్టీ తరుపున ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించిన చరిత్ర కలిగినవాడు …తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీకే పరిమితం కావడంతో తెలంగాణలోని ఒక్క ఖమ్మం జిల్లాలోనే సత్తా చాటుకున్న వైకాపా కొద్దిరోజులకే అధికార టీఆర్ యస్ లో చేరింది. దీంతో ఇక్కడ వైకాపా లేకుండా పోయింది. శ్రీనివాసరెడ్డి ఎంపీ గా ఉండి టీఆర్ యస్ లో చేరుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ తిరిగి ఎంపీ సీటు ఇస్తానని హామీ ఇచ్చారు . తెలంగాణాలో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలను 2018 లోనే పట్టించి తిరిగి అధికారం లోకి వచ్చారు . ఆ ఎన్నికల్లో కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థి కాకుండా వైరాలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రాములు నాయక్ ను గెలిపించడం కేసీఆర్ కు అస్సలు నచ్చలేదు . పైగా మధిర ఇంచార్జిగా ఉండి అక్కడ టీఆర్ యస్ తరుపున పోటీచేసిన లింగాల కమల రాజ్ ను గెలిపించలేక పోయారు .

దీంతో సీఎం కేసీఆర్ దగ్గర మైనస్ అయింది. అయితే పార్టీ యువనేత కేటీఆర్ తో మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే 2019 లో జరిగిన ఎన్నికల్లో ఆయనకు ఖమ్మం పార్లమెంట్ సీటు వస్తుందని అనుకున్న అది రాలేదు . టీడీపీ లో ఉన్న నామ నాగేశ్వరరావు ను టీఆర్ యస్ లో చేర్చుకొని ఖమ్మం లోకసభ సీటు ఇచ్చారు . ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అందులో కూడా అనేక ఛాన్స్ లు పోయాయి. కొత్తగా జిల్లాకు చెందిన బండి పార్థ సారధి రెడ్డి , వద్దిరాజు రవి చంద్ర కు రాజ్యసభ సీట్లు ఇచ్చిన శ్రీనివాస రెడ్డి పేరు కనీసం పరిశీలించకపోవడంపై పార్టీ పై తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు అనుయాయులు పార్టీ మారాలని వత్తిడి తెస్తున్నారు . కేటీఆర్ శ్రీనివాస్ రెడ్డిను పోగొట్టుకోమని చెబుతున్నారు . కానీ ఆయన్ను ఎక్కడ అకామిడేట్ చేస్తారనే విషయం చెప్పటంలేదు . దీంతో తనతో ఉన్న నాయకులూ కార్యకర్తలు మీరు ఎదో ఒక నిర్ణయం తీసుకోవాలని వత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం

బీజేపీ …కాంగ్రెస్ నుంచి ఆఫర్లు

శ్రీనివాసరెడ్డికి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మంచి ఆఫర్లే ఉన్నట్లు తెలుస్తుంది. …ఎప్పటి నుంచో బీజేపీ శ్రీనివాసరెడ్డికి గాలం వేసింది. ఆయనతో పాటు ఈ జిల్లాలో మరికొందరు ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నారు . ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతా అప్పగిస్తామని పెద్ద నేతలే చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా శ్రీనివాస రెడ్డిని కలిసినట్లు సమాచారం .వారు కూడా ఆయనకు పెద్ద పీఠ వేస్తామని అన్నట్లు సమాచారం . అయితే జిల్లాలో ఉన్న రాజకీయ పరిస్థితులరీత్యా కాంగ్రెస్ అయితే అనుకూలంగా ఉంటుంది. దేశ స్థాయిలో చేస్తే బీజేపీ బెటర్ అనే అభిప్రాయంతో ఆయన ఉన్నారు . ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన ఆయన మరికొద్దిరోజుల్లోనే మంచి జరుగుతుందని చెప్పడం , దేవుడు మనకు అండగా ఉంటాడని చెప్పడం తో ఆయన రాజకీయ అడుగులపై మరోసారి ఆశక్తి నెలకొన్నది ….ఆయన రాజకీయంగా తప్పటడుగులు వేస్తున్నారా ?టీఆర్ యస్ తో తన ప్రయాణం సాధ్యం కాదని భావిస్తున్నారా ? అనేది చర్చనీయాంశంగా మారింది.

అధైర్యపడవద్దు అండగా ఉంటా … మాజీ ఎంపీ పొంగులేటి

మణుగూరు మండలంలో పర్యటించిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులను కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ అధైర్యపడవద్దు అండగా ఉంటాను అని పొంగులేటి ధైర్యం చెప్పారు. మణుగూరు మండలంలోని సుందరయ్య నగర్ నందు సామా సత్యనారాయణ రెడ్డి కొద్దిరోజుల క్రితం చనిపోయిన విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ సోమవారం వారి ఇంటి వద్దకు వెళ్లి ఆయన చిత్రపటానికి పూలు వేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మునిసిపాలిటీ పరిధిలోని మణుగూరు గ్రామంలో కూచిపూడి బాబు శాస్త్ర చికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకుని వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. నున్న రామారావు తండ్రి నున్న సత్యనారాయణ దశదినకర్మలకు హాజరై చిత్రపటానికి పూలు వేసి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఆదర్శనగర్ గ్రామంలో మల్లె మొగ్గల రంగారావు తల్లి అనసూయమ్మ దశదినకర్మలకు పొంగులేటి హాజరై, చిత్రపటానికి పూలు వేసి నివాళు లర్పించారు. మండలంలోని సమితి సింగారం గ్రామంలో పిల్లలమర్రి బ్రహ్మాజీరావు గారు,కొద్దిరోజుల క్రితం చనిపోయిన విషయం తెలుసుకొని ఈ రోజు వారి ఇంటి వద్దకు వెళ్లి చిత్రపటానికి పూలు వేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. పొంగులేటి వెంట పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు

ఒదుగుతూ…ఎదగడం నా నైజం
-గెలుపు పొందే వరకు ఆలుపులేదు
-నా జీవితం ప్రజాక్షేత్రానికే అంకితం
-తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి

పినపాక: ఒదుగుతూ ఎదగడం తన నైజమని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగిన నిగర్విగానే ఉంటానని.. అందరిలా ఎగిసిపడే మనస్తత్వం తనది కాదని మరోమారు స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులే తనకు శ్రీరామరక్ష అని వెల్లడించారు. గత మూడు రోజులుగా ఉమ్మడి ఖమ్మంజిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్న ఆయన సోమవారం పినపాక నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితాన్ని ప్రజాక్షేత్రానికే అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే తన ధ్యేయమన్నారు. రాబోవు ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసి తీరుతానని గెలుపుపొందే వరకు ఆలుపు లేకుండా శ్రమిస్తానని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో రాబోవు ఎన్నికల్లో తన విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి మణుగూరు మండలంలోని బండారుగూడెం, మణుగూరు గ్రామాలు, అశ్వాపురం మండలంలోని మిట్టగూడెం, అమెంతకాలనీ, అశ్వాపురం, సీతారాంపురం,మొండికుంట గ్రామాలు, బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం, మొరంపల్లి బంజర, బూర్గంపాడు, రెడ్డిపాలెం, సారపాక గ్రామాలను సందర్శించారు. పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆర్థికసాయాలను అందజేశారు. ఆపదలో నేనున్నా మీ శీనన్నను అనే భరోసాను కలిగించారు. అదేవిధంగా పోలవరం ముంపు బాధితులు చేస్తున్న దీక్షకు తన మద్దతు తెలిపి ప్రసంగించారు.

Related posts

తెలంగాణ ఆడబిడ్డలారా… ధైర్యం కోల్పోకండి: వైఎస్ ష‌ర్మిల భ‌రోసా

Drukpadam

రేవంత్ రెడ్డి డైరక్షన్ లో పొన్న ప్రభాకర్ కోవర్ట్ … కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు…

Drukpadam

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి దూరమైన కేటీఆర్…

Drukpadam

Leave a Comment