Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

ఆసియా కప్ ఫైనల్ కు చేరాలంటే.. భారత్ ముందున్న అవకాశాలు ఇవీ..!

ఆసియా కప్ ఫైనల్ కు చేరాలంటే.. భారత్ ముందున్న అవకాశాలు ఇవీ..!
-మిగిలిన రెండు మ్యాచుల్లో నెగ్గితేనే ఫైనల్ బెర్త్
-6న శ్రీలంక, 8న ఆప్ఘన్ తో మ్యాచ్ లు
-నెట్ రన్ లో వెనుకబడిన భారత్

భారత్ సూపర్ 4లో పాక్ చేతిలో ఓటమి పాలై ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయినా, ఇప్పటికీ ఆసియాకప్ ఫైనల్స్ కు చేరే అవకాశాలు ఇంకా మిగిలి ఉన్నాయి. భారత్ ఈ నెల 6న శ్రీలంకతో, 8న ఆప్ఘనిస్థాన్ తో తలపడనుంది. ఈ రెండింటిలోనూ టీమిండియా విజయం సాధించాల్సి ఉంటుంది.

భారత్ మిగిలిన రెండు మ్యాచుల్లోనూ నెగ్గితే, అప్పుడు ఆప్ఘనిస్థాన్ ఎలిమినేట్ అవుతుంది. అలాగే, తదుపరి మ్యాచ్ లో శ్రీలంకను పాకిస్థాన్ ఓడించగలిగితే.. అప్పుడు శ్రీలంక ఇంటికి వెళ్లిపోతుంది. ఒకవేళ శ్రీలంక మిగిలిన రెండింటిలో నెగ్గితే అప్పుడు నెట్ రన్ రేటు కీలకం అవుతుంది. కనుక భారత్ శ్రీలంక, అప్ఘానిస్థాన్ పై మంచి మార్జిన్ తో విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పుడు ఫైనల్స్ కు చేరుకోవచ్చు.

ప్రస్తుతం పాకిస్థాన్ నెట్ రన్ రేటు ప్లస్0.126గా ఉంది. శ్రీలంక నెట్ రన్ రేట్ ప్లస్ 0.589, భారత్ నెట్ రన్ రేటు మైనస్ 0.126గా ఉంది. భారత్ మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిచి తీరాల్సిన అవసరం ఏర్పడింది. ఆ రెండు జట్ల బలబలాలను పరిశీలిస్తే, భారత్ కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే ఫైనల్స్ లో మళ్లీ భారత్, పాకిస్థాన్ పోరాడనున్నాయి. దీనిపై పాక్ క్రికెటర్ రిజ్వాన్ స్పందిస్తూ.. ఇది మూడు మ్యాచుల పాక్-భారత్ సిరీస్ అవుతుందని సరదాగా వ్యాఖ్యానించాడు.

నిన్న జరిగిన భారత్ -పాక్ మ్యాచ్ లో భారత్ గెలుపు దగ్గరకు వచ్చినట్లే వచ్చి మ్యాచ్ చేజార్చుకోవడం విమర్శలకు దారితీసింది. అలిరౌండర్ హార్దిక్ పాండ్య , సీనియర్ బౌలర్ భవనేశ్వర్ కుమార్ వల్లనే భారత్ ఓడిపోయిందని అంటున్నారు క్రీడా పండితులు . ఇప్పటికైనా భారత్ కు ఫైనల్ చేరే అవకాశాలు ఉన్నప్పటికీ జాగ్రత్తగా ఆడకపోతే ఇంటిదారి పట్టడం తప్పదని అంటున్నారు .

Related posts

టీం ఇండియా లో విభేదాలు అంటూ పాకిస్తాన్ దుష్ప్రచారం ….

Drukpadam

సురేశ్ రైనాను తీసుకోకపోవడంపై వివరణ ఇచ్చిన చెన్నై సూపర్ కింగ్స్!

Drukpadam

ఇండోర్ టెస్టులో ఘోర పరాజయానికి రోహిత్ శర్మ చెప్పిన కారణాలు ఇవే!

Drukpadam

Leave a Comment