Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ ట్రస్… రిషి సునాక్ కు నిరాశ!

బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ ట్రస్… రిషి సునాక్ కు నిరాశ!
-కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా లిజ్ ట్రస్ ఎన్నిక
-తద్వారా ప్రధాని పీఠం కూడా ట్రస్ కైవసం
-చివరి వరకు పోటీ ఇచ్చిన సునాక్
-బ్రిటన్ మూడో మహిళా ప్రధానిగా ట్రస్

బ్రిటన్ ఎన్నికలు ముగిశాయి. భారత సంతతికి ఛేనిండిన రిషి సునాక్ ను ఊరించిన ప్రధాని పదవి దగ్గరకి వచ్చి పోయింది. హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే చర్చ ప్రపంచ వ్యాపితంగా జరిగింది. చివరకు బ్రిటన్ కు కన్జర్వేటివ్ పార్టీ అధినేతగా లిజ్ ట్రస్ ఎన్నిక కావటంతో ప్రధాని పీఠం కూడా ఆమెకే దక్కింది. 47 సంవత్సరాల లిజ్ ట్రస్ బ్రిటన్ మూడో మహిళా ప్రధానిగా ఎన్నికవడం విశేషం . ఇప్పటివరకు ఇద్దరు మహిళలు బ్రిటన్ ప్రధానులుగా ఎన్నికైయ్యారు . వారికో మార్గరెట్ థాచర్, థెరెసా మే లు బ్రిటన్ ప్రధానులుగా పదవులు చేపట్టారు .
బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ సహచరుడు రిషి సునాక్ తో పోరులో లిజ్ ట్రస్ కే ఓటర్లు పట్టం కట్టారు. లిజ్ ట్రస్ కు 81,326 ఓట్లు రాగా, రిషి సునాక్ కు 60,399 ఓట్లు లభించాయి. ప్రధాని పీఠం కోసం చివరివరకు బరిలో నిలిచిన భారత సంతతి రాజకీయవేత్త రిషి సునాక్ ప్రధాని పదవిపై ధీమాగా ఉన్నప్పటికీ నిరాశ తప్పలేదు.

లిజ్ ట్రస్ నిన్నటివరకు బ్రిటన్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. వివాదాలు, ప్రజావ్యతిరేకత కారణంగా బోరిస్ జాన్సన్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవడంతో ఎన్నిక చేపట్టారు. కన్జర్వేటివ్ పార్టీకి అధినేతగా ఎన్నికయ్యే వ్యక్తే బ్రిటన్ ప్రధాని అవుతారన్న నేపథ్యంలో, లిజ్ ట్రస్ సొంత పార్టీ సభ్యులను ఆకట్టుకోవడంలో విజయవంతం అయ్యారు. మార్గరెట్ థాచర్, థెరెసా మే తర్వాత బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన మూడో మహిళగా లిజ్ ట్రస్ నిలిచిపోతారు. ట్రస్ ఎన్నికతో బ్రిటన్ లో నూతన శకం ప్రారంభం కానున్నది .

Related posts

పంజాబ్ మాజీ సీఎం అమరిందర్ సింగ్ ప్రయాణమెటు …?

Drukpadam

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆత్మహత్య చేసుకుంటా…..జోగు రామన్న

Drukpadam

పీఎం మోడీకి తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్ …!

Drukpadam

Leave a Comment