ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులుగా శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక!
–సెక్రటరీ జనరల్ గా బల్విందర్ జమ్మూ ….
-12 రాష్ట్రాల నుంచి వారిపేర్లతో నామినేషన్లు
–నామినేషన్ల చివరిరోజు ఒక్క సెట్ నామినేషన్లు రావడంతో వారి ఎన్నిక –ఏకగ్రీవం అయినట్లు ప్రకటించిన ఎన్నికల అధికారి ఎం ఏ మాజీద్
–జర్నలిస్టుల సమస్యల పరిస్కారం కృషి చేస్తామని వెల్లడి
–తమపై నమ్మకంతో భాద్యతలు ఉంచిన వివిధ రాష్ట్రాల జర్నలిస్ట్ నాయకులకు కృతజ్నతలు
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ , ప్రజాపక్షం ఎడిటర్ , ఐజేయూ అధ్యక్షులుగా వ్యహరిస్తున్న కె .శ్రీనివాస్ రెడ్డి , తిరిగి ఆ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు . ఆయన గత 50 సంవత్సరాలుగా జర్నలిస్ట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు . వివిధ హోదాల్లో ఆయన జర్నలిస్టులు పక్షాన నిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ప్రెస్ ఎకాడమి చైర్మెన్ గా వ్యవహరించిన ఘనత కూడా ఆయనికి దక్కింది . జర్నలిస్ట్ ఉద్యమ చరిత్రలో ఆయనకు అత్యంత ప్రతిభాశాలిగా పేరుంది. నిర్మాణంలోనూ , నాయకులను తయారు చేయడంలోనూ ఆయన అనుసరిస్తున్న పద్ధతులు మరొకరు వేలెత్తి చూపలేనివిగా ఉంటాయి. అనేక క్లిష్ట సమస్యలను సైతం ఇట్టే పరిష్కరించగల దిట్ట . తెలుగు రాష్ట్ర జర్నలిస్ట్ ఉద్యమ చరిత్రలో ఆయన మకుటంలేని మహారాజు … రాష్ట్రానికి సీఎం ఎవరైనా శ్రీనివాస్ రెడ్డి సలహాలు సూచనలు తీసుకున్నారంటే ఆశ్చర్యం లేదు .
శ్రీనివాస్ రెడ్డి గతంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సెక్రటరీ జనరల్ గా సుదీర్ఘకాలం పనిచేశారు . 12 రాష్ట్రాల నుంచి ఐజేయూ అధ్యక్షులుగా శ్రీనివాస్ రెడ్డి , సెక్రటరీ జనరల్ గా బల్విందర్ జమ్మూ పేర్లతో నామినేషన్లు దాఖలు కావడంతో వారిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎం ఏ మాజీద్ ప్రకటించారు. వారి ఎన్నిక పట్ల తెలంగాణ , అంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నేతలు అంబటి ఆంజనేయులు , వై నరేందర్ రెడ్డి , నగునూరి శేఖర్ , విరహత్ అలీ , సుబ్బారావు , చందు జనార్దన్ , ఆలపాటి సురేష్ , డి సోమసుందర్ , దాసరి కృష్ణారెడ్డి , కె సత్యనారాయణ , తదితరులు హర్షం ప్రకటించారు .