విమానాల్లో మధ్యసీటును వదిలేస్తే కొవిడ్ ముప్పు తగ్గుతుంది: శాస్త్రవేత్తలు
- మధ్యసీటును వదిలేయడం ద్వారా ముప్పును 57 శాతం తగ్గించొచ్చు
- కిటికీలు, ద్వారాలు మూసి ఉంచడం వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది
- అమెరికా సీడీసీ అధ్యయనంలో వెల్లడి
విమాన ప్రయాణాల సమయంలో మధ్య సీటును ఖాళీగా ఉంచడం ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. విమాన ప్రయాణ సమయంలో ద్వారాలు, కిటికీలు పూర్తిగా మూసి ఉంచడం, ప్రయాణ సమయం ఎక్కువగా ఉండడం వంటివి వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణాల్లో వైరస్ వ్యాప్తి ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రాలు (సీడీసీ), కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మూడు సీట్లున్న విమానాల మోడల్‌ను రూపొందించి అధ్యయనం చేపట్టారు.