భారత్ జోడో యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ…
- కన్యాకుమారిలో యాత్రను ప్రారంభించిన రాహుల్
- సేవా దళ్ శ్రేణుల వెనుకే తొలి అడుగు వేసిన నేత
- కశ్మీర్ వరకు సాగనున్న పాదయాత్ర
రానున్న ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర చేపట్టింది. ఇప్పటికే కాంగ్రెస్ పని అయిపోయిందని , ఇక దాన్ని ఎవరు కాపాడలేరని ప్రచారం సాగుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు . కాంగ్రెస్ ను అస్థిరపరిచేందుకు కాంగ్రెస్ లోని కొందరు అగ్రనేతలు కొంతకాలంగా చేసుతున్న ప్రయత్నాలను సైతం ఎదుర్కొంటూనే కాంగ్రెస్ పార్టీని బ్రతికించడంతో పాటు అధికారంలోకి తేవడం ద్వారా పేదప్రజలు ఆదుకోవాలని అందుకోసం తన తండ్రి , నానమ్మలు దేశంకోసం చేసిన ప్రాణాలను హృదకానివ్వనని రాహుల్ చెప్పడం ప్రజల్లో చర్చనీయాంశానికి దారితీసింది. దేశంలోని అనేక ప్రధాన రాష్ట్రాలను కలుపుతూ సాగనున్న భారత్ జోడో యాత్ర లాంగ్ మార్చ్ ను తలపించనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కాశ్మిర్ వరకు సాగనున్న ఈ యాత్ర పై కాంగ్రెస్ పార్టీ గంపెడు ఆశలు పెట్టుకున్నది . వారి ఆశలు నెరవేరుతాయా? లేదా ? అనేది చూడాల్సి ఉంది . ఈ ప్రతిష్ట్మాక యాత్రలో సోనియా గాంధీ ,ప్రియాంక , కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యమంత్రులు , సీనియర్ నేతలు , పాల్గొంటారు . ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాలలోని అసెంబ్లీ , పార్లమెంటరీ నియోజకవర్గాల్లో స్థానిక నేతలు పాదయాత్రలకు సిద్దపడుతున్నారు .
2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం సాయత్రం ప్రారంభం అయ్యింది. బుధవారం సాయంత్రం 5 గంటలకు తమిళనాడులోని కన్యాకుమారిలో రాహుల్ తన యాత్రను ప్రారంభించారు. తన ముందు పార్టీ సేవా దళ్ శ్రేణులు కదం తొక్కుతూ సాగగా… రాహుల్ గాంధీ తన సుదీర్ఘ యాత్రను ప్రారంభించారు.
దాదాపుగా 150 రోజుల పాటు సాగనున్న ఈ యాత్ర 3,570 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. కన్యాకుమారిలో మొదలైన ఈ యాత్ర కశ్మీర్‌లో ముగియనుంది. దేశంలోని మెజారిటీ రాష్ట్రాల మీదుగా ఈ యాత్ర సాగేలా కాంగ్రెస్ పార్టీ రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. రాహుల్ గాంధీ యాత్ర చేపట్టడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వ్యక్తమవుతోంది.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మద్దతు పలికిన ఎంకే స్టాలిన్
- కన్యాకుమారి నుంచి యాత్రను ప్రారంభించిన రాహుల్
- యాత్ర వద్దకే వచ్చి రాహుల్‌ను కలిసిన స్టాలిన్
- పలు అంశాలపై రాహుల్‌తో చర్చలు జరిపిన తమిళనాడు సీఎం
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత భారత్ జోడో యాత్ర పేరిట బుధవారం ప్రారంభించిన పాద యాత్రకు డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మద్దతు పలికారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి రాహుల్ తన యాత్రను బుధవారం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర వద్దకు వచ్చిన స్టాలిన్… రాహుల్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని సన్మానించిన స్టాలిన్… పలు అంశాలపై ఆయనతో చర్చించారు.