Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

డోలో- 650 తయారీ సంస్థకు క్లీన్ చిట్ …

డోలో- 650 తయారీ సంస్థకు ఫార్మా అసోసియేషన్ క్లీన్ చిట్ …

  • ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ మార్గదర్శకాలను మైక్రోల్యాబ్స్ పాటించినట్టు వెల్లడి
  • రూ.1,000 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పడం అసమంజసంగా అభివర్ణన 
  • ఫార్మాస్యూటికల్ డిపార్ట్ మెంట్ కు ఐపీఏ నివేదిక

సాధారణ జ్వరం, నొప్పి నివారణ ఔషధమైన డోలో 650 (ప్యారాసెటమాల్) తయారీ సంస్థ, బెంగళూరుకు చెందిన మైక్రోల్యాబ్స్ కు ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలియన్స్ (ఐపీఏ) క్లీన్ చిట్ ఇచ్చింది. డోలో 650 మాత్రలను సిఫారసు చేసినందుకు గాను వైద్యులకు మైక్రోల్యాబ్స్ పెద్ద మొత్తంలో ప్రోత్సాహకాలు ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటుండడం తెలిసిందే. రూ.1,000 కోట్ల వరకు ఇచ్చిందన్న వార్తలు రాగా, అసలు డోలో 650 విక్రయాలే అన్ని లేవని మైక్రోల్యాబ్స్ ఖండించడం తెలిసిందే.

దీనిపై ఒక నివేదికను డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ (కేంద్ర రసాయనాల శాఖ పరిధిలో), నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్ పీపీఏ)కి ఐపీఏ సమర్పించింది. ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ విధానాల మార్గదర్శకాలను మైక్రోల్యాబ్స్ అనుసరించినట్టు తన నివేదికలో ఐపీఏ తెలిపింది. అనైతిక, తప్పుడు విధానాలను అనుసరించిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాల్లేవని తేల్చి చెప్పింది.

మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ సమాఖ్య గత నెలలో సుప్రీం కోర్టులో మైక్రోల్యాబ్స్ కు వ్యతిరేకంగా పిటిషన్ వేయడం గమనార్హం. మైక్రోల్యాబ్స్ వైద్యులకు రూ.1,000 కోట్ల ఉచిత తాయిలాలు ఇచ్చినట్టు ప్రత్యక్ష పన్నుల మండలి ఆరోపించడాన్ని పిటిషన్ లో ప్రస్తావించింది. దీన్ని ఐపీఏ తన నివేదికలో ప్రస్తావిస్తూ.. ఒక ఏడాదిలో ఒక్క డోలో 650 బ్రాండ్ పై ఉచితాల కోసం రూ.1,000 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పడం అసమంజసం’’ అని పేర్కొంది.

Related posts

Tech News | This Is Everything Google Knows About You

Drukpadam

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి గుండెపోటు.. చెన్నై అపోలోకు తరలింపు!

Drukpadam

పాక్ జాతీయ అసెంబ్లీలో గందరగోళం… ఏప్రిల్ 3కి వాయిదా పడిన సభ!

Drukpadam

Leave a Comment