Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జాతీయపార్టీ పేరుతొ కేసీఆర్ కొత్త నాటకం : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క!

జాతీయపార్టీ పేరుతొ కేసీఆర్ కొత్త నాటకం : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క!
లౌకిక శక్తులను అడ్డుకునేందుకే కొన్ని శక్తులు ముందుకు వస్తున్నాయి
కేసీఆర్ జాతీయ పార్టీ కూడా అలాంటిదే
జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ సంకేతాలు
లౌకికవాదులను అడ్డుకునేందుకు శక్తులు పుట్టుకొచ్చాయన్న భట్టి
కేసీఆర్ జాతీయ పార్టీతో కాంగ్రెస్ కు ఎలాంటి నష్టంలేదని వెల్లడి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ధీమా

కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీనేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆయన జాతీయపార్టీ పెట్టడం వల్ల కాంగ్రెసు పార్టీకి వచ్చిన నష్టమేమి లేదని అన్నారు . అయితే మతతత్వానికి వ్యతిరేకంగా ఐక్యమౌతున్న లౌకిక శక్తులను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు . కాంగ్రెసు పార్టీ పేదలకోసం ఎన్ని పథకాలు తెచ్చిన విషయాన్నీ భట్టి గుర్తు చేశారు.

త్వరలో జాతీయ పార్టీ ప్రారంభించనున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టమైన సంకేతాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు.

దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో లౌకికవాద మద్దతుదారులంతా కాంగ్రెసు పార్టీ వైపు వస్తున్నారని, అలా వస్తున్న వారిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు పుట్టుకొచ్చాయని తెలిపారు. కేసీఆర్ జాతీయ పార్టీ కూడా అలాంటి శక్తుల్లో ఒకటై ఉండొచ్చని విమర్శించారు. కేసీఆర్ జాతీయ పార్టీతో కాంగ్రెస్ కు వచ్చిన నష్టమేమీలేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

ఇక మునుగోడు ఉప ఎన్నికలో తాము శాస్త్రీయంగా ఆలోచించి పాల్వాయి స్రవంతిని ఎంపిక చేశామని చెప్పారు. మునుగోడులో స్రవంతి గెలుపు ఖాయమని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయభేరి మోగించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

Related posts

నల్లారి, సినీ నటుడు మోహన్ బాబు బీజేపీ వైపు చూస్తున్నారా …?

Drukpadam

తెలంగాణాలో నిధులు మల్లింపుపై కేంద్రం సీరియస్ …!

Drukpadam

మోడీని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ నోరు ఎందుకు మూగపోయింది… సీపీఐ నారాయణ…

Drukpadam

Leave a Comment