Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మునుగోడులో టీఆర్ యస్ కు మద్దతు ద్వారా కమ్యూనిస్టులకు లాభమా ? నష్టమా..

మునుగోడులో టీఆర్ యస్ మద్దతు ద్వారా కమ్యూనిస్టులకు లాభమా ? నష్టమా..
బలహీన పడ్డ కమ్యూనిస్టులకు ఇది వరమా ? శాపమా ??
వచ్చే అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యూనిస్టులు టీఆర్ యస్ తో కలిసి పోటీచేస్తారా ?
కమ్యూనిస్టులు అడుగుతున్న సీట్లపై కేసీఆర్ ఒకే చెప్పారా ?
రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపై కమ్యూనిస్టుల వైఖరి ఏమిటి ?

తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక పెద్ద రచ్చ చేస్తుంది. కొత్త పొత్తులు , ఎత్తులు , సమీకరణలతో రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టిస్తుంది. కమ్యూనిస్టులను దగ్గరకు రానివ్వని కేసీఆర్ ,వారు ఎక్కడున్నారని ప్రశ్నించిన కేసీఆర్ నేడు కమ్యూనిస్టులు లేకపోతె మునుగోడులో ఇబ్బందులు తప్పవని తెలుసుకున్న తర్వాత వారి కోసం వెంటపడటం ప్రారంభించారు . వారు కూడా రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నందున కేసీఆర్ అడిగిందే తడువుగా మునుగోడులో టీఆర్ యస్ కు మద్దతు ఇచ్చేందుకు ఒకే చెప్పేశారు . ఇది కమ్యూనిస్టులకు లాభమా ? నష్టమా ? అనే దానిపై భిన్న వాదనలు ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీలలో సిపిఎం కాంగ్రెసు కు , సిపిఐ టీఆర్ యస్ కు మద్దతు ఇస్తుందని కొందరు , లేదు రెండు పార్టీలు కాంగ్రెసు కు మద్దతు ఇవ్వడం ద్వారా దేశ రాజకీయాల్లో కొత్త వరవడిని తీసుకొస్తారని మరికొందరు భావించారు . కానీ అందుకు విరుద్ధంగా జరగటంతో లెఫ్ట్ పార్టీల వైఖరిపై చర్చ జరుగుతుంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పడి టీఆర్ యస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్టుల ప్రభావం బాగా తగ్గింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులుగా ఉన్న కమ్యూనిస్టుల చరిత్ర కనుమరుగు చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో సాయుధ తెలంగాణ పోరాటం తో ఏమాత్రం సంబంధంలేని బీజేపీ , టీఆర్ యస్ లు తామేదో తెలంగాణ విమోచన కు పాల్పడినట్లు సాయుధ తెలంగాణ పోరాటాన్ని కమ్యూనిస్టుల త్యాగాలను , 4 వేల మందికి పైగా చేసిన ఆత్మబలిదానాలు పూర్వపక్షం చేసే ప్రయత్నం జరుగుతున్నాయి . కమ్యూనిస్టులు లేకు
ండా
తెలంగాణ విమోచన జరిగేది కాదనేది జగమెరిగిన సత్యం . నైజంకు వ్యతిరేకంగా రజాకార్లతో పోరాటం చేస్తూ యూనియన్ సైన్యాలకు వ్యతిరేకంగా రైతులకు అండగా నిలిచింది కమ్యూనిస్టులుఇప్పుడు కేంద్రం లో అధికారంలోకి వచ్చిన బీజేపీ నాడు కాంగ్రెసు ప్రభుత్వంలో హోమ్ మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లనే తెలంగాణకు విమోచన జరిగిందని అంటూనే ఆయన బీజేపీ నాయకుడిగా మార్చే ప్రయత్నం చేయడం చరిత్రను వక్రీకరించడమేఇది జుగుస్సాకరం ..

టీఆర్ యస్ తో కమ్యూనిస్టులు కలిసి ప్రయాణం అనేది వరమా ? శాపమా ? అనే చర్చ కూడా ఉంది. కేసీఆర్ తో స్నేహం పై కమ్యూనిస్టులు ఆలోచించుకోవాల్సిందేననే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఎన్టీఆర్ తో స్నేహం వల్ల నష్టపోయామని అభిప్రాయపడుతున్న కమ్యూనిస్టులు , ఎన్టీఆర్ తో పోల్చితే ఫక్తు రాజకీయనాయకుడిగా ఉన్న కేసీఆర్ తో కలిసి నడవడం సాధ్యమౌతుందా అనేది ప్రశ్న? …ఇది ఎంతవరకు లాభం అనేది చూడాల్సిందే ?

వచ్చే అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్షాలు టీఆర్ యస్ తో కలిసి పోటీ చేస్తాయా ?

వచ్చే ఎన్నికల్లో పోటీపై కమ్యూనిస్టులు , టీఆర్ యస్ కలిసి పోటీచేస్తాయా ? లేదా అనే విషయంలో క్లారిటీ లేదు . సిపిఐ తన అభిప్రాయాన్ని చెప్పనప్పటికీ , సిపిఎం మునుగోడు వరకే టీఆర్ యస్ తో పొత్తు అని చెప్పింది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతాను అని అంటున్న కేసీఆర్ లౌకిక శక్తులను దెబ్బతీసేందుకు జాతీయపార్టీ పెట్టబోతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీనిపై కమ్యూనిస్టుల వైఖరి స్పష్టం కావాల్సి ఉంది.

కమ్యూనిస్టులతో పొత్తు ఉంటె ఏ ఏ సీట్లు వాళ్ళు అడుగుతున్నారు . వారు అడిగే సీట్లకు కేసీఆర్ ఒకే చెప్పారా ? అంటే దీన్ని ఇంతముందుగా ఊహించడం సరికాక పోవచ్చు … అయితే వారి మధ్య సీట్ల విషయం చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతుంది.

ఇక రాష్ట్రంలో ప్రజాసమస్యల పరిష్కరంలో కేసీఆర్ ప్రభుత్వం వైఖరిని కమ్యూనిస్టులు సమర్థిస్తున్నారా ? ఇప్పటివరకు ప్రజల తరుపున పోరాటాలు నిర్వహించిన కమ్యూనిస్టులు వైఖరి ఏ విధంగా ఉండబోతుంది అనేది రాష్ట్రంలో ప్రజల తరుపున కమ్యూనిస్టులు ఏవిధంగా నిలబడతారు అనేది చూడాల్సి ఉంది.

Related posts

వడ్లు కొనుగోళ్లపై పార్లమెంట్ లో కేంద్రాన్ని నిలదీస్తాం …టీఆర్ యస్ లోకసభ పక్ష నేత నామా!

Drukpadam

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవం..!

Drukpadam

మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం.. 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పై నిలిచిపోయిన ప్రధాని..

Drukpadam

Leave a Comment