Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలి. తమ్మినేని వీరభద్రం

రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించాలి. తమ్మినేని వీరభద్రం
– పేద ప్రజల సమస్యలపై ఒక్కరోజు నిరాహార దీక్ష
– అర్హులందరికీ ఆసరా పింఛన్ అందించాలి
– 57 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలి.
– సొంత స్థలం కలిగిన వారికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇవ్వాలి.
– అర్హులు కలిగిన వారందరికీ రేషన్
కార్డులు ఇవ్వాలి.
– అర్ధులైన పేద వాళ్ళందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి.
– లబ్ధిదారులు ఎంపికలకు అధికారి పార్టీ నాయకులు జోక్యం ఉండకూడదు.
– జీవో నెంబరు ప్రకారం వేతనాలు వెంటనే పెంచాలి.

రాష్ట్రంలో ప్రజాసమస్యలు పరిస్కరించాలని కేసీఆర్ సర్కార్ ను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు . ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని త్రీ టోన్ ప్రాంతంలోని వ్యవసాయ గ్రైన్ మార్కెట్ వద్ద సోమవారం ప్రజా సమస్యల పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం త్రీ టౌన్ లో పేద ప్రజల సమస్యలపై ఒక్కరోజు నిరాహార దీక్షను సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించారు.

ఈ సందర్భంగా సిపిఎం త్రీ టౌన్ కార్యదర్శి భూక్య శ్రీనివాస్ అధ్యక్షత నిర్వహిస్తూ ఈ సభలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ. రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు 57 సంవత్సరాల నిండిన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని సొంత ఇండ్ల జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయలు కాకుండా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు.

అర్హత కలిగిన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర మొత్తంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలు ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పారు.

ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మతోన్మాద దుష్టశక్తులు ముందుకొస్తున్నారని వారిని పారద్రోలటానికి మనమంతా ఏకమవ్వాలని దుష్టశక్తులను వెళ్లగొట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్, సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, పార్టీ త్రీ టౌన్ నాయకులు వజెనేపల్లి శ్రీనివాసరావు, 31 డివిజన్ కార్పొరేటర్ ఎర్ర గోపి, బండారు యాకయ్య , బండారు వీరబాబు, మద్ది సత్యం, వేల్పుల నాగేశ్వరరావు, కొట్టే అలివేలు, ఉపేంద్రమ్మ, పోతురాజు జార్జి, రామ్మూర్తి, మండల వీరస్వామి, సోమనబోయిన వెంకటేశ్వర్లు, హెచ్ పేరయ్య, లక్ష్మణ్, అమరగాని బుచ్చయ్య, నూకల నాగేశ్వరరావు, మేళ్లచెరువు హనుమంతరావు, చేడే వెంకటేశ్వరరావు, పాశం సత్యనారాయణ, భూక్య సుభద్ర, పగడాల మోహన్రావు, తదితరులు పాల్గొన్నారు,

 

టు టౌన్ , త్రీ టౌన్ , వన్ టౌన్ ప్రాంతాల్లో సిపిఎం ఆధ్వరంలో జరిగిన నిరనస దీక్షలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరైయ్యారు . యర్రా శ్రీకాంత్ , విక్రమ్ , యర్రా శ్రీను , తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొని ప్రజాసమస్యల పరిష్కరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు .

Related posts

కాంగ్రెస్ లో మల్లి కుంపట్లేనా ….రేవంత్ ముందు ఉన్న కీం కర్తవ్యం!

Drukpadam

సిద్దు ప్రమాణ స్వీకారానికి కెప్టెన్ అమరిందర్ …పక్క్కపక్కనే కూర్చొని కబుర్లు!

Drukpadam

ఎక్కడ బంగారు తెలంగాణ …ఎక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు…

Drukpadam

Leave a Comment