Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

భారత జర్నలిస్టు నుంచి ఫోన్ లాక్కునేందుకు యత్నించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా!

భారత జర్నలిస్టు నుంచి ఫోన్ లాక్కునేందుకు యత్నించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా!
-ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ ఓటమి
-మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించిన రమీజ్ రాజా
-పాకిస్థాన్ ఓటమిపై ప్రశ్నించిన రిపోర్టర్
-నువ్వు భారత్ నుంచి వచ్చావా? అని అడిగిన రమీజ్ రాజా
-భారత్ అభిమానులు సంతోషించి ఉంటారని వ్యాఖ్యలు

క్రికెట్ లో అద్భుతాలు జరుగుతుంటాయి అనేందుకు ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ మంచి ఉదాహరణ … శ్రీలంక , పాకిస్తాన్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో అందరు పాకిస్తాన్ వైపు మొగ్గు చెప్పారు .అయినప్పటికీ శ్రీలంక అద్భుత విజయం సంధించి ఆసియా కప్ సొంతం చేసుకుంది.దీంతో క్రీడా పండితుల జోష్యాలు తలకిందులైయ్యాయి.

ఆసియా కప్ ఫెవరేట్ గా బరిలోకి దిగిన భారత్ గ్రూప్ మ్యాచ్ నుంచే వైదొలగింది. తొలుత పాకిస్తాన్ మీద గెలిచినప్పటికీ , రెండవ మ్యాచ్ లో ఓటమి చెందడమే కాకుండా , శ్రీలంక చేతిలో పరాభవం తప్పలేదు . దీంతో తొలిదశలోనే ఇంటిముఖం పట్టింది రోహిత్ సేన

ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్ ఓడిపోవడం ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజాను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఈ మ్యాచ్ ను రమీజ్ రాజా ప్రత్యక్షంగా తిలకించాడు. శ్రీలంక చేతిలో పాక్ చావుదెబ్బతినడం రమీజ్ రాజాకు మింగుడుపడలేదు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఓ భారత జర్నలిస్టు రమీజ్ రాజా స్పందన కోరాడు. పాకిస్థాన్ ఓటమిపై ఏమంటారని అడిగాడు.

అప్పటికే తీవ్ర అసహనంలో ఉన్న రమీజ్ రాజాకు ఈ ప్రశ్నతో పుండుమీద కారం చల్లినట్టయింది. సమాధానం దాటవేసేందుకు ప్రయత్నించాడు. ఆ పాత్రికేయుడి నుంచి ఫోన్ లాగేసుకునేందుకు ప్రయత్నించాడు. ‘నువ్వు భారత్ నుంచి వచ్చావా? ఈ ఫైనల్ మ్యాచ్ చూసి భారత అభిమానులు సంతోషిస్తారనుకుంటా’ అని రమీజ్ రాజా వ్యాఖ్యానించాడు.

‘సార్… నేను మామూలుగానే అడుగుతున్నాను’ అని ఆ జర్నలిస్టు వివరణ ఇచ్చినా, సమాధానమిచ్చేందుకు రమీజ్ రాజా ఇష్టపడలేదు. టోర్నీలో దారుణంగా విఫలమైన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ ఆటతీరుపై స్పందించాలని ఓ మహిళా జర్నలిస్టు కోరగా, ఎంతో చక్కగా ఆడాడని రమీజ్ రాజా బదులిచ్చాడు.

Related posts

కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్.. 5 పరుగుల పెనాల్టీ వేయాల్సిందే: బంగ్లాదేశ్

Drukpadam

నన్ను కెప్టెన్ గా నియమిస్తారనుకున్నాను… మనసులో మాట బయటపెట్టిన యువరాజ్ సింగ్…

Drukpadam

ఘనతంతా షమీదే.. ఆ బౌన్సరే నాలోని ఆటగాడిని లేపింది.. హార్దిక్ పాండ్యా!

Drukpadam

Leave a Comment