Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రేణుక చౌదరి …అమరావతి మద్దతు రహస్యం …

అమ‌రావ‌తి రైతుల యాత్ర‌లో రేణుకా చౌద‌రిపుష్ప డైలాగ్‌తో ఆక‌ట్టుకున్న కాంగ్రెస్ నేత‌

  • అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ కోసం మ‌హాపాద‌యాత్ర ప్రారంభం
  • యాత్ర‌లో పాల్గొని సంపూర్ణ మ‌ద్ద‌తు తెలిపిన రేణుకా చౌద‌రి
  • పుష్ప డైలాగ్‌తో రైతుల్లో ఉత్సాహం నింపిన కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌

ఏపీ రాజ‌ధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ కోసం సోమ‌వారం ప్రారంభించిన మ‌హాపాద‌యాత్ర‌కు తెలంగాణ‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత రేణుకా చౌద‌రి సంఘీభావం ప్ర‌క‌టించారు. సోమ‌వారం యాత్రకు స్వ‌యంగా హాజ‌రైన ఆమె టాలీవుడ్ హిట్ సినిమా పుష్ప‌లోని పాప్యుల‌ర్ డైలాగ్ చెబుతూ ఆక‌ట్టుకున్నారు.

ఏపీకి ఏకైక రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ప్ర‌క‌టించేదాకా త‌గ్గేదే లే అంటూ పుష్ప సినిమా డైలాగ్ చెప్పిన రేణుకా చౌద‌రి… ఆ సినిమాలో హీరో అల్లు అర్జున్ ప్ర‌ద‌ర్శించిన హావ‌భావాల‌ను ప్ర‌ద‌ర్శించారు. రేణుకా చౌద‌రి పుష్ప డైలాగ్‌తో అమ‌రావతి రైతుల్లో మ‌రింత ఉత్సాహం ఇనుమ‌డించింది. అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ కోసం జ‌రుగుతున్న ఉద్య‌మానికి ఆది నుంచి మ‌ద్ద‌తు ప‌లుకుతున్న రేణుకా చౌద‌రి ప‌లు కీల‌క స‌మ‌యాల్లో రైతుల ఉద్య‌మంలో స్వ‌యంగా పాలుపంచుకుంటున్న సంగ‌తి తెలిసిందే.

రేణుక చౌదరిఅమరావతి మద్దతు రహస్యం
ఫైర్ బ్రాండ్ గా పేరున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి అమరావతి ఉద్యమానికి , అమరావతి రాజధానికి మద్దతు ఇచ్చేందుకు స్వయంగా వచ్చి పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఆమె తెలంగాణాలో రాజకీయాలు చేస్తూ ఆంధ్రాలో ఎందుకు పాల్గొంటున్నారు ? దీనికి గల కారణాలు ఏమిటి ? దీని వెనక ఉన్న రహస్యం ఏమిటనేది. ఆసక్తిగా మారింది. మొదటి నుంచి వైయస్ కుటుంబానికి రేణుక చౌదరి దూరంగానే ఉంటున్నారు . ఏపీ లో జగన్ పాలన రావడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు . అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జగన్ సీఎం కాకుండా చేయడంలోనూ , ఆయన చేపట్టిన ఓదార్పు యాత్ర ను తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో రేణుక చౌదరి ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆమె వాటిపై ఎప్పుడు స్పందించలేదు . పైగా ఖమ్మం నుంచి తిరిగి రానున్న లోకసభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలనీ అనుకుంటున్నారు . అప్పుడు ఏపీ కి బోర్డర్ గా ఉన్న ఖమ్మం జిల్లా పై ఏపీ ప్రభావం ఉంటుంది. అందువల్ల ఇక్కడ ప్రజల మనసులను దోచుకోవడంతో పాటు తెలుగు దేశం అభిమానం పొందటం ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని సాఫీగా సాగించవచ్చుననేది ఆమె ఆలోచనగా ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం …

Related posts

మోదీతో భేటీ అయిన మమతా బెనర్జీ!

Drukpadam

షర్మిల 25 వేల సహాయం…ఒక్క పాలేరులోనేనా ?రాష్ట్రమంతనా ??

Drukpadam

క్షమాపణ చెప్పకపోతే సస్పెన్షన్ ఎత్తేసే ప్రసక్తే లేదు.. 12 మంది ఎంపీలపై కేంద్రం!

Drukpadam

Leave a Comment