Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఢిల్లీలో ఎంపీ అధికారిక నివాసాన్ని వెంటనే ఖాళీ చేయండి…సుబ్రమణ్యస్వామికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం ….

అధికారిక నివాసాన్ని ఖాళీ చేయండి… మాజీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం

  • 6 వారాల్లో అధికారిక బంగ్లా ఖాళీ చేయాల‌న్న హైకోర్టు
  • సుదీర్ఘ కాలం పాటు జ‌న‌తా పార్టీలో కొన‌సాగిన సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి
  • ఇటీవ‌లే ముగిసిన స్వామి రాజ్య‌స‌భ స‌భ్య‌త్వం

బీజేపీ నేత‌, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సుబ్ర‌హ్మ‌ణ్య స్వామికి బుధ‌వారం ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఢిల్లీలో కేటాయించిన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల‌ని హైకోర్టు ఆయ‌న‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ఆయ‌న‌కు 6 వారాల గ‌డువు ఇచ్చింది. బీజేపీ ఎంపీగా ప‌ద‌వీ కాలం ముగిసిన నెల‌ల వ్య‌వ‌ధిలోనే ఆయ‌న‌కు ఈ త‌ర‌హా ఆదేశాలు జారీ కావ‌డం గ‌మ‌నార్హం.

సుదీర్ఘ కాలం పాటు జ‌న‌తా పార్టీలో కొన‌సాగిన సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి… ఆ పార్టీకి అధ్య‌క్షుడిగానూ వ్య‌వ‌హ‌రించారు. 2013లో జ‌న‌తా పార్టీని వీడిన ఆయ‌న బీజేపీలో చేరారు. అంతకుముందు మాజీ ప్ర‌ధాని చంద్ర‌శేఖ‌ర్ కేబినెట్‌లో మంత్రిగానూ ప‌ద‌వి చేప‌ట్టారు. బీజేపీలో చేరాక 2016లో రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ప‌దవి చేప‌ట్టిన ఆయ‌న ఈ ఏడాది ఏప్రిల్ 24న త‌న ప‌ద‌వీ కాలాన్ని ముగించారు. బీజేపీలో ఉంటూనే ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ సాగిన సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి నిత్యం వార్త‌ల్లోనే ఉండేవారు.

Related posts

మొదలైన మేడారం మినీ జాతర..క్యూకడుతున్న భక్తులు…

Drukpadam

మాకు అపారమైన శక్తి ఉంది.. కానీ..: మణిపూర్ అల్లర్లపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Drukpadam

దర్యాప్తు సంస్థల దుర్వినియోగం కేసులో ప్రతిపక్షాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

Drukpadam

Leave a Comment