Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల సంక్షేమం కోసం…ఏ త్యాగానికి వెనకాడం: టీయూడబ్ల్యూ జె ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ..

జర్నలిస్టుల సంక్షేమం కోసం…ఏ త్యాగానికి వెనకాడం: టీయూడబ్ల్యూ జె ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ..

ఉద్యమాలఫలితంగానే అక్రిడేషన్లు , ఇళ్లస్థలాలు , వైద్యసదుపాయాలు
“జర్నలిస్ట్ కో జమీన్ ఔర్ మకాన్” నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన
దేశవ్యాపితంగా జర్నలిస్టుల ప్రయోజనాలకోసం నిలిచేది తమసంఘమే …ఐజేయూ కార్యదర్శి నరేందర్ రెడ్డి …

 

రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటామని, జర్నలిస్టుల హక్కుల సాధనకై ఎలాంటి త్యాగానికైనా తాము సిద్ధమేనని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. విరాహత్ అలీ అన్నారు.
బుధవారం నాడు శామీర్ పేట మండలం తుంకుంటలోని మొగుళ్ల వెంకట్ రెడ్డి గార్డెన్స్ లో జరిగిన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ద్వితీయ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.
నాడు ఉమ్మడి రాష్ట్రంలో, నేడు తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల పక్షపాతిగా నిలబడి రాజీలేని పోరాటాలు చేస్తున్న ఘనచరిత్ర తమ సంఘానికి ఉందని ఆయన అన్నారు. గతంలో తమ సంఘం అవిశ్రాంత పోరాటాల ఫలితంగానే రాష్ట్రంలో జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు, పలువురికి ఇళ్ల స్థలాలు, వైద్య పథకం తదితర సౌకర్యాలు సాధించగలిగినట్లు విరాహత్ అలీ స్పష్టం చేశారు. అదే స్ఫూర్తితో ముందుకెళ్తూ “జర్నలిస్ట్ కో జమీన్ ఔర్ మకాన్” నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని ఉదృతం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
జర్నలిస్టు సంఘాల పేరుతో స్వప్రయోజనాల కోసం కొన్ని శక్తులు జర్నలిస్టుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టే చర్యలకు పాల్పడడం సహించారనిదన్నారు.
ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి మాట్లాడుతూ నిరంతరం జర్నలిస్టుల మేలును కాంక్షిస్తూ దేశంలో ఐజేయూ, రాష్ట్రంలో టీయుడబ్ల్యుజె సంఘాలు మాత్రమే పోరాడుతున్నాయని స్పష్టం చేశారు. ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు కల్లూరి సత్యనారాయణ మాట్లాడుతూ తమ సంఘం కార్మిక శాఖ నియమావళికి లోబడి, జర్నలిస్టుల సంక్షేమం కోసం చిత్తశుద్ధి, అంకితభావంతో పనిచేస్తుందన్నారు.
యూనియన్ జిల్లా అధ్యక్షుడు మోతె వెంకట్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర కోశాధికారి కే. మహిపాల్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రాజేష్, జిల్లా కార్యదర్శి జి.బాల్ రాజ్, హెచ్.యు.జే కార్యదర్శి శిగా శంకర్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మల్కయ్య, యూనియన్ సీనియర్ నాయకుడు మరాఠీ రవి తదితరులు మాట్లాడారు.
ఆయా నియోజకవర్గాల కమిటీల బాధ్యులు సభలో తమ నివేదిక సమర్పించారు.

భారీగా తరలివచ్చిన జర్నలిస్టులు

ఇవ్వాళ తుంకుంటలో జరిగిన టీయుడబ్ల్యుజె(ఐజేయూ) మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మహాసభకు జర్నలిస్టుల నుండి అపూర్వ స్పందన లభించింది. జిల్లాలోని మల్కాజ్ గిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, కూకట్ పల్లి నియోజకవర్గాల నుండి బస్సులు తీసుకొని భారీ సంఖ్యలో జర్నలిస్టులు తరలివచ్చారు. టీయుడబ్ల్యుజె,ఐజేయూ జిందాబాద్, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ జర్నలిస్టుల నినాదాలు సభలో మారుమ్రోగాయి.

Related posts

బహుభార్యత్వం భరించాల్సిందే కానీ.. ప్రోత్సహించాల్సినది కాదు…

Drukpadam

మోదీ, అమిత్ షా మూడో కన్ను తెరిస్తే కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయం: బాపూరావు

Drukpadam

ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి స్పందించిన గవర్నర్ ,కేంద్రమంత్రి!

Drukpadam

Leave a Comment