Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణాలో 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాల్లో సిపిఐ పోటీ : కూనంనేని!

తెలంగాణాలో 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాల్లో సిపిఐ పోటీ : కూనంనేని!
-ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు స్థానాల్లో పోటీకి సమాయత్తం
-టీఆర్ యస్ తో తమబంధం ఫెవికాల్ లాంటిది ఏమి కాదు
-పొత్తు కొనసాగింపు పై ఇప్పుడే చెప్పలేము
-బీజేపీని ఓడించేందుకే మునుగోడులో టీఆర్ యస్ కు మద్దతు
-దేశంలో కాంగ్రెస్ తో పొత్తు ఉన్న రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితుల ఆధారంగా పొత్తులు
-ప్రజాసమస్యలపై టీఆర్ యస్ తో పోరాడతాం
-సింగరేణి ఎన్నికల్లో టీఆర్ యస్ కార్మిక సంఘంతో పొత్తు ఉండదు
-పార్టీ క్యాడర్ ను కన్విన్స్ చేసే టీఆర్ యస్ తో దోస్తీ …

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 25 నుంచి 30 స్థానాల్లో పోటీచేసేందుకు సమాయత్తం అవుతుందని అందుకు అనుగుణంగా పార్టీని నిర్మాణం చేస్తామని సిపిఐ నూతన రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు . శుక్రవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన రాష్ట్రంలో రాజకీయపరిస్థితులు సిపిఐ విధానం , టీఆర్ యస్ తో పొత్తు గురించి ఆయన వివరించారు . రాష్ట్రంలో కమ్యూనిస్టులకు మంచి ఆదరణ ఉందని అందుకు అనుగుణంగా పార్టీని ప్రతిగ్రామంలో సిపిఐ జెండా అనే నినాదంతో ముందుకు పోతామని అన్నారు . పోరాటాల గడ్డ తెలంగాణ …కమ్యూనిస్టులను గుండెల్లో పెట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకున్న ప్రజలు తెలంగాణ ప్రజలు… ఎర్రజెండా ప్రజలకు అండ… , పోరాటాల పురిటి గడ్డగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి సిపిఐ , సిపిఎం ప్రాతినిధ్యం రాష్ట్ర శాసనసభలో కచ్చితంగా ఉంటుందని అనుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తామని సాంబశివరావు స్పష్టం చేశారు .

పార్టీ పోటీ చేసే స్థానాల్లో పార్టీ నిర్మాణం పెంచేందుకు క్యాడర్ ను పెంచుకునేందుకు తనగిన కార్యాచరణ , రూపొందిస్తామని అన్నారు . హోల్ టైమర్లు ను పెంచుతాం వ్యూహాత్మకంగా ,వ్యహరిస్తాం ,ప్రజలసమస్యలను గుర్తించి ఉద్యమాలు చేస్తామని అన్నారు . రాష్ట్ర వ్యాపితంగా కొత్త వరవడిని సృష్టిస్తామని అన్నారు .

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఐదు స్థానాలపై ఫోకస్ పెట్టమని వాటిలో పోటీకి సిద్దపడుతున్నామని అన్నారు . అందులో పాలేరు , వైరా , కొత్తగూడెం , పినపాక , భద్రాచలం స్థానాల్లో పోటీచేసేందుకు సిద్దపడుతున్నామని అన్నారు . సిపిఎం కూడా వాటినే కోరుతుంది కదా అని విలేకర్లు ప్రశ్నించగా వాటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు .

మునుగోడు ఎన్నికలపై ప్రజల్లో కమ్యూనిస్టుల నిర్ణయంపై అసంతృప్తి ఉంది కదా అని ప్రశ్నించగా మునుగోడులో ఇప్పడు తాము పోటీ చేసే పరిస్థితి లేదని బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ యస్ బలంగా ఉందని అందువల్ల దానికి మద్దతు ఇస్తున్నామని అన్నారు . దేశంలో సిపిఐ పార్టీ కాంగ్రెస్ తో కలిసి నడిచినా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులను భట్టి నిర్ణయాలు ఉంటాయని అన్నారు . మునుగోడులో మద్దతు ఇచ్చినంత మాత్రాన వారితో తమది ఫెవికాల్ బంధం ఏమి కాదని అన్నారు . అసరమైతే టీఆర్ యస్ కు వ్యతిరేకంగా పోటీచేస్తామన్నారు . సింగరేణి ఎన్నికల్లో తమ సంఘం టీఆర్ యస్ సంఘంతో కలిసి పోటీచేయదని స్పష్టం చేశారు .

రాజ్ భవనం ముట్టడి ….

రాష్ట్ర గవర్నర్ రాజ్యాంగ బద్దంగా వ్యవహరించడంలేదని బీజేపీ నాయకురాలుగా వ్యవహరిస్తున్నారని అందువల్ల ఆమె తీరు మార్చుకోవాలని లేకపోతె రాజ్ భవనం ముట్టడికి వెనకాడే ప్రసక్తి లేదని అన్నారు .

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి …

రాష్ట్రంలో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరతానని సాంబశివరావు తెలిపారు . ప్రజాసమస్యలపై తమ ఉద్యమాలు కొనసాగుతాయని అందులో ఎలాంటి రాజీ ఉండబోదని అన్నారు .

ఖమ్మం రూరల్ సిఐ ని బదిలీ చేయాలిసిందే …కూనంనేని

ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ పోలీస్ స్టేషన్ ను పార్టీ కార్యాలయంగా మార్చిన సిఐ ని వెంటనే ఇక్కడ నుంచి బదిలీ చేయాలనీ సాంబశివరావు డిమాండ్ చేశారు . దీనిపై ఇప్పటికే సిపి విష్ణు వారియర్ ను కలిసి రెప్రజెంట్ చేశామని , శనివారం హైద్రాబాద్ లో డీజీపీ ని కలిసి సిఐ చర్యలను వివరిస్తామని అన్నారు . ఆయన భార్య రూరల్ తహసీల్దార్ గా కూడా పని చేస్తున్నారని ఇద్దరు ఒకే మండలంతో పనిచేయడంపై కూడా సిపిఐ నాయకులూ అభ్యంతరం తెలిపారు …

సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంతరావు , జిల్లా కార్యదర్శి పోటీ ప్రసాద్ , జిల్లా నాయకులూ జమ్ముల జితేందర్ రెడ్డి , ఎర్రబాబు , జానీమియా తదితరులు పాల్గొన్నారు .

Related posts

పాదయాత్రలు చేసినా, మోకాలి యాత్రలు చేసినా అవి కాశీ యాత్రలే:బీజేపీపై జగదీశ్ రెడ్డి ఫైర్

Drukpadam

నాడు రోశయ్య అసెంబ్లీకి ఉరితాడు తెచ్చుకుంటే వద్దని వారించాం: సీఎం కేసీఆర్!

Drukpadam

చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణ.. కర్రలతో కొట్టుకున్న టీడీపీ, వైసీపీ 

Drukpadam

Leave a Comment