Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప‌రేడ్ గ్రౌండ్స్ స‌మీపంలో ‘మోదీ తప్పక సమాధానం చెప్పాలి’ పోస్ట‌ర్ల క‌ల‌క‌లం!

ప‌రేడ్ గ్రౌండ్స్ స‌మీపంలో ‘మోదీ తప్పక సమాధానం చెప్పాలి’ పోస్ట‌ర్ల క‌ల‌క‌లం!

  • తెలంగాణ‌కు రావాల్సిన ప్రాజెక్టుల‌కు సంబంధించిన పలు ప్ర‌శ్న‌లు
  • తిరుమ‌ల‌గిరి, ఎస్‌డి రోడ్‌, టివోలి క్రాస్‌రోడ్‌, మారేడ్‌పల్లిలోని ప్రధాన జంక్షన్లలో గోడ‌ల‌కు పోస్ట‌ర్లు
  • ఇంగ్లిష్ లో మొత్తం 14 ప్ర‌శ్న‌లతో కొన్ని రోజుల ముందే వెల‌సిన పోస్ట‌ర్లు 

తెలంగాణ‌లో రాజ‌కీయాలు మ‌రోసారి వేడెక్కాయి. కేంద్రం, రాష్ట్రంలలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ ఈ రోజు (సెప్టెంబ‌ర్ 17) పోటాపోటీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నాయి. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న‌  హైదరాబాద్‌ విమోచన దినోత్సవానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా న‌గ‌రానికి వ‌చ్చారు.

మ‌రోవైపు ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు జూబ్లీ హాల్ లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో పాల్గొంటున్నారు. అయితే, సికింద్రాబాద్ ప‌రేడ్ గ్రౌండ్స్ పరిస‌రాల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని ప్ర‌శ్నిస్తూ కొన్ని వాల్‌ పోస్టర్లు వెలిశాయి.

తిరుమ‌ల‌గిరి, ఎస్‌డి రోడ్‌, టివోలి క్రాస్‌రోడ్‌, మారేడ్‌పల్లిలోని ప్రధాన జంక్షన్లు, కూడళ్లలో ‘మోదీ తప్పక సమాధానం చెప్పాలి’ అనే హెడ్డింగ్ తో కూడిన పోస్టర్లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది. స్థానిక కంటోన్మెంట్ బోర్డు అధికారులు పరేడ్ గ్రౌండ్స్ సమీపంలోని కొన్ని ప్రాంతాలలో వాటిని తొలగించారు. కానీ కొన్ని గంటల తర్వాత సమీప ప్రదేశాల్లోని గోడ‌ల‌పై ఈ పోస్ట‌ర్లు తిరిగి రావ‌డం గ‌మ‌నార్హం.

ఈ పోస్టర్లలో తెలంగాణ‌కు సంబంధించి ఇంగ్లిష్ లో 20 ప్రశ్నలు ఉన్నాయి. తెలంగాణకు ఐఐఎం ఎక్కడ? తెలంగాణకు ఐటీఐఆర్ ఎక్కడ? తెలంగాణకు మెడికల్ కాలేజీ ఎందుకు మంజూరు చేయలేదు? పసుపు బోర్డు ఎక్కడ ఉంది? పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు మంజూరు చేయలేదు? అంటూ మోదీని ఉద్దేశించిన ప్ర‌శ్న‌లు రాసి ఉన్నాయి.

అలాగే, గోవా విమోచన దినోత్సవానికి రూ. 300 కోట్లు ఇచ్చిన భారత ప్రభుత్వం హైదరాబాద్ విమోచన దినోత్సవానికి పైసా ఎందుకు ఇవ్వ‌లేదు? కంటోన్మెంట్‌లో 30 వేల మంది  ఓటింగ్ హక్కుల భార‌త ప్ర‌భుత్వం ఎందుకు తొల‌గించింది? మీరు దాన్ని పునరుద్ధరిస్తారా? అంటూ మ‌రిన్ని ప్ర‌శ్న‌లు క‌నిపించాయి. ఈ పోస్టర్లు  బీజేపీ స‌భ‌కు కొన్ని రోజుల ముందే వెల‌సినట్లు తెలుస్తోంది.

Related posts

ప్రధాని మోడీ ,అదానీకి ఉన్న బంధంపై పార్లమెంట్ లో నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ..!

Drukpadam

ఎంపీ పార్థసారథి రెడ్డికి తుమ్మల సత్కారం …

Drukpadam

విపక్ష కూటమికి ఇండియా పేరు సూచించిన మమతా …!

Drukpadam

Leave a Comment