Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఢిల్లీకి రాహుల్… రేపు యాత్రకు బ్రేక్ …

రేపు రాహుల్ యాత్రకు బ్రేక్… ఎల్లుండి సోదరితో కలిసి యాత్రకు కాంగ్రెస్ నేత!

  • కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు వెలువడ్డ నోటిఫికేషన్
  • కేరళ వచ్చి రాహుల్ తో సమావేశమైన అశోక్ గెహ్లాట్
  • అధ్యక్ష ఎన్నికలపై చర్చల కోసమే నేటి రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న రాహుల్

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు రేపు (శుక్రవారం) విరామం ఇవ్వనున్నారు. ప్రస్తుతం కేరళలో యాత్రను సాగిస్తున్న రాహుల్ గాంధీ… నేటి రాత్రి ఢిల్లీ బయలుదేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రేసులో ముందు వరుసలో ఉన్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గురువారం యాత్రలో ఉన్న రాహుల్ తో సమావేశమైన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా రాహుల్, గెహ్లాట్ ల మధ్య పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన చర్చలు జరిగాయి. పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ఇతర నేతలు, ఎన్నికలపై పార్టీ అధిష్ఠానం పెద్దలతో చర్చలు జరిపే నిమిత్తమే రాహుల్ గాంధీ నేటి రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో ఈ చర్చలన్నింటినీ ముగించుకుని ఎల్లుండి (శనివారం) ఉదయానికి రాహుల్ తిరిగి కేరళ చేరుకుంటారు. ఈ దఫా ఆయన తన సోదరి ప్రియాంకా గాంధీ వాద్రాతో కలిసి యాత్రను ప్రారంభించనున్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి.

Related posts

నా గుండె చెదరలేదు ..నా సంకల్పం మారలేదు… ప్లీనరీ లో జగన్ అద్భుత ప్రసంగం!

Drukpadam

రాహుల్ గాంధీతో భేటీ అయిన ప్రశాంత్ కిశోర్…

Drukpadam

వైట్ ఛాలంజ్ కు దూరంగా కేటీఆర్ …కేటీఆర్ కోసం ఎదురు చుసిన రేవంత్ ,విశ్వేశర రెడ్డి!

Drukpadam

Leave a Comment