ఆంధ్రప్రదేశ్

పుతిన్ కు మోదీ సూచన..స్పందించిన రష్యా..!

పుతిన్ కు మోదీ సూచన..స్పందించిన రష్యా..!

ఇది యుద్ధాల యుగం కాదంటూ ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచన చేశారు. దీనిపై తాజాగా రష్యా స్పందించింది.పశ్చిమ దేశాలు ఈ విషయాన్ని తమకు నచ్చినట్టుగా అన్వయించుకున్నాయని వ్యాఖ్యానించింది.’పశ్చిమ దేశాలు అసలు విషయాన్ని పక్కన పెట్టి, తమకు కావాల్సిన వాక్యాన్ని నచ్చినట్టుగా అన్వయించుకుంటాయి’ అని భారత్‌లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్‌ అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ చేసి ఎనిమిది నెలలు కావొస్తోంది. ఈ దాడికి ముగింపు ఇవ్వాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. ఈ క్రమంలో ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సుకు హాజరైన మోదీ.. అక్కడే పుతిన్‌తో విడిగా భేటీ అయ్యారు. ఆ సమయంలో పుతిన్‌తో మాట్లాడుతూ.. ప్రస్తుత యుగం యుద్ధాలది కాదని ఆయనకు సూచించారు.

ప్రపంచాన్ని ఇబ్బందిపెడుతున్న ఆహార, ఇంధన సంక్షోభాలకు వెంటనే పరిష్కార మార్గాలు కనుగొనాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ఆయన పిలుపునకు సానుకూలంగా స్పందించిన పుతిన్‌.. సాధ్యమైనంత త్వరగా యుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఇదిలా ఉంటే.. మోదీ సూచనను అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు ప్రశంసిస్తున్నాయి. యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకే ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నాయి.

Related posts

అందుకే రోహిత్ శ‌ర్మ బాగా ఆడ‌లేదు: టీమిండియా ఘోర ఓట‌మిపై సునీల్ గ‌వాస్క‌ర్ వ్యాఖ్య‌లు

Drukpadam

అదానీ గ్రూప్ పై ఆరోపణలపై విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు!

Drukpadam

Here Are 8 Editors-Approved IGK Hair Products You Need to Try

Drukpadam