Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బెల్లం వేణు నీ చరిత్ర ఏమిటి..? : సిపిఐ నేత మౌలానా !

బెల్లం వేణు నీ చరిత్ర ఏమిటి..? : సిపిఐ నేత మౌలానా !
– ప్రశాంతంగా ఉన్న మండలంలో చిచ్చుపెడితే సహించం-
-ఆగడాలు.. సెటిల్మెంట్లు.. బెదిరించడమేనా నీ పని
-కేసులకు భయపడం – ప్రజా ఉద్యమాలు ఆగవు
– ఏ చర్చకైనా మేము సిద్ధం …ముఠా నాయకుడు సిద్ధం కావాలి
– సిఐ సారూ పద్ధతి మార్చుకోండి: సిపిఐ నేత దండి సురేష్

బెల్లం వేణు నీ చరిత్ర ఏమిటి ? ఎక్కడ అధికారం ఉంటె అక్కడ చేరి ప్రశాంతంగా ఉన్న మండలంలో చిచ్చు పెట్టడమేనా ? ఇదే నీ వైఖరి అయితే కమ్యూనిస్ట్ పార్టీ చూస్తూ ఊరుకోదు …ప్రజల తరుపున ,ప్రజలకు అండగా ఎన్ని త్యాగాలకైనా సిద్దమే అనేది గుర్తుంచుకో అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహ్మద్ మౌలానా టీఆర్ యస్ నేతపై ఘాటు హెచ్చరికలు చేశారు .. ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లు అధికార పార్టీ పంచన చేరి పబ్బం గడుపుకునే నాయకులు కమ్యూనిస్టు పార్టీని ఖమ్మం రూరల్ మండలంలో ఏమీ చేయలేరని గట్టి కౌంటర్ ఇచ్చారు . శనివారం ఎదులాపురంలోని జీవిఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మండలంలో టీఆర్ యస్ , పోలీసులు ,ఇతర అధికారులు కలిసి చేస్తున్న చర్యలపై మండిపడ్డారు . సెటిల్మెంట్లు, బెదిరించడం రాజకీయాలు కాదని ఆయన తెలుసుకుంటే మంచిదన్నారు. అవసరాల కోసం ఎవరి పంచనో చేరి పెత్తనం చేయాలని భావిస్తే మండల ప్రజలు సహించరన్నారు. మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత సిపిఐకి ఉందన్నారు. గాలి మాటలతో ఎక్కువ కాలం ప్రజలను నమ్మించ లేరని మౌలానా తెలిపారు. వార్త కార్యాలయం పక్కన నువ్వు ఆక్రమించిన భూమి సంగతి ఏమిటని ఆయన ప్రశ్నించారు. పోలేపల్లి ముగ్గుబొందల గుట్ట ఆక్రమణలో నీ పాత్ర ఏమిటో మండల ప్రజలకు తెలుసునన్నారు. అనైతిక రాజకీయాలకు పాల్పడుతూ లబ్ది పొందాలని చూస్తే కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోబోదన్నారు. ప్రశాంతతను కోరుకునే కమ్యూనిస్టు పార్టీ దోపిడీకి, కబ్జాలకు వ్యతిరేకమని కమ్యూనిస్టు పార్టీని విమర్శించే ముందు నీ నేపథ్యం ఏమిటో తెలుసుకోవాలన్నారు.

కేసులకు భయపడేది లేదు – పోరాటం ఆపేది లేదు : దండి

కేసులకు భయపడేది లేదని ప్రజల పక్షాన తమ పోరాటాలను కూడా ఆపేది లేదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్ తెలిపారు. మీడియా సమావేశంలో సురేష్ మాట్లాడుతూ కొంత మంది అధికారులను అడ్డం పెట్టుకుని కబ్జాకోరులను వెంటేసుకుని ముఠా నాయకునిలా వ్యవహరించే వారికి తగు సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అధికారులు కూడా తమ స్థాయిని మరిచి ప్రవర్తిస్తే అదిరి బెదిరి తమను నమ్ముకున్న ప్రజలను వదిలి పోయేది లేదన్నారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వేణు ఒక ముఠా నాయకునిలా వ్యవహరిస్తున్నారని ఎదులాపురం సొసైటీ గురించి ఆయన ప్రస్థావించారని ఎదులాపురం సొసైటీని ఆయన పార్టీకి అప్పగిస్తే కోట్ల రూపాయల అవినీతి చోటు చేసుకుందని అది రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. పంపకాల్లో తేడా రావడంతో కోట్ల అవినీతి బయటపడిందని ఇప్పటికీ రైతు రుణాలు రెన్యూవల్ కాలేదని కోటలు కూలుస్తానంటూ ప్రగ్బాలాలు పలుకుతున్న వేణుకు దమ్ముంటే ఎదులాపురం సొసైటీని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సురేష్ సవాల్ విసిరారు. గ్రీన్ బెల్ట్కు సంబంధించి అనవసర ఆరోపణలు చేశారని సిపిఐ నాయకులు ఎవరు కూడా ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదని వేణు అనుచరులు మా పార్టీ ప్రత్యర్థులే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని గ్రీన్ ల్యాండ్ స్థలాల గురించి తన చుట్టూ ఉన్న వారిని ప్రశ్నిస్తే మంచిదని సురేష్ సూచించారు. రియల్ ఎస్టేట్ ద్వారా వ్యక్తిగతంగా నేను కానీ నా కుటుంబం కానీ లబ్ది పొందినట్లుగా ఉంటే ఏ విచారణకైనా సిద్ధమని దమ్ముంటే మా ప్రత్యర్థులు కూడా విచారణకు సిద్ధం కావాలని సురేష్ సవాల్ విసిరారు. ప్రశాంతంగా వ్యాపారం చేసుకునేందుకు ఇక్కడ బలమైన సిపిఐ సహకరించింది కాబట్టే ఎదులాపురం పంచాయతీ పరిధిలోని రైతుల భూముల ధరలకు రెక్కలు వచ్చాయని ఆయన తెలిపారు. వ్యాపారులను బెదిరిస్తూ లబ్ది పొందలేదని చెరువు కట్టలకు గండ్లు పెట్టి బెదిరింపులకు పాల్పడలేదని అటువంటి దగుల్బాజీ పనులు ఎవరు చేశారో మండల ప్రజలకు తెలుసునన్నారు. 193 సర్వే నెంబరులో నీకు భూమి ఎలా వచ్చిందో చెప్పి ముక్కు నేలకు రాయాలని దండి సురేష్ డిమాండ్ చేశారు. బెల్లం వేణు చుట్టూ కబ్జాకోరులే ఉన్నారని పోలేపల్లి సర్వే నెం.166లో ఒక ప్రభుత్వ స్థలాన్ని 15 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుని కొందరు గ్రానైట్

వ్యాపారం చేసుకుంటుంటే దానికి పట్టా ఎవరు ఇచ్చారని సురేష్ ప్రశ్నించారు. నీ ముఠా సభ్యులు కొందరు ఆ ప్రాంతంలో మోటార్లను ధ్వంసం చేసి బెదిరింపులకు గురి చేసింది వాస్తవం కాదా అని సురేష్ ప్రశ్నించారు. సర్వే నెం. 126 లోని గురుదక్షిణ ఫౌండేషన్లో రెండు ఎకరాల ఆక్రమణకు ప్రయత్నిస్తున్న వ్యక్తులు నీ అనుచరులు కా అందులో మీ వాటా లేదా అని సురేష్ ప్రశ్నించారు. ఖమ్మం రూరల్ మండలంలో అనేక చో 3/4 ప్రభుత్వ, ప్రైవేటు భూముల ఆక్రమణ జరిగిందని ప్రభుత్వ భూమిని మీ అనుచరుడు విక్రయి.. చేసింది నిజం కాదా అని సురేష్ ప్రశ్నించారు. చింతపల్లి గ్రామంలో కుమ్మరికుంట శిఖాన్ని ఆక్రమిస్తే ఐబి అధికారులు మీ నాయకులపై కేసు నమోదు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గ్రామ కంఠం భూమిని తన పేర పట్టా చేయించుకున్న ఓ ఊసర వెల్లి కూడా అనవసర ఆరోపణలు చేస్తున్నదని ఎవరి బతుకేంటో అదరికీ తెలుసునన్నారు. మంగళగూడెం గ్రామానికి చెందిన నున్నా నర్సయ్య తన సొంత భూమిని సాగు చేయనివ్వకుండా, విక్రయించకుండా బెల్లం వేణు పెడుతున్న ఇబ్బందులు అందరికీ తెలుసునన్నారు. కెకె రెడ్డి క్వారీ విషయంలోనూ 142 సర్వే నెంబరులో నీ అనుచరుడు సాగిస్తున్న అక్రమ వ్యవహారం నిగ్గు తెల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా క్షేత్రంలో బలహీన పర్చలేరు :

వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా ప్రజా క్షేత్రంలో తమను బలహీన పర్చలేరని సురేష్ తెలిపారు. 15. సంవత్సరాల వయస్సు నుంచే కాయ కష్టం చేశామని ఆకు కూరలు అమ్ముకుంటూ వ్యవసాయం చేస్తూ తమ పిల్లలను చదివించుకుంటూ ఎదిగామని సురేష్ తెలిపారు. ఒక సారా గుమస్తా అయిన వేణు గ్లాసులు కడిగిన వ్యక్తి ఎలా ఆర్థికంగా ఎదిగడాని, ఏమీ చేశాడని, ఎలా వచ్చిందో ఆస్తి చెప్పాలని సురేష్ డిమాండ్ చేశారు. మా ఆస్తులకు సంబంధించి ఏ చర్చకైనా సిద్దమని చర్చకు సిద్దం కావాల్సింది బెల్లం వేణు ముఠాయేనని సురేష్ తెలిపారు. ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం, తెలంగాణ ఉద్యమంలో జైలుకు కూడా పోయాం. మీ ఊడత ఊపులకు భయపడే వారు. ఎవరు లేరన్నారు. మాది కష్టపడ్డ కుటుంబమే కానీ క్యారెక్టర్ అమ్ముకున్న కుటుంబం కాదన్నారు. న్యాయం పక్కన నిలబడతాం, కలబడతాం, బాధలు ఇబ్బందులను లెక్కచేయబోమన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టిఆర్ఎస్ జెండా ఎగురుతుందని ఉత్తర ప్రగ్భాలాలు పలికే ముఠా నాయకుడు ఎన్నికలు జరపాలని మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఎందుకు ఎదురు వచ్చాడని సురేష్ ప్రశ్నించారు. ఎదులాపురం సిపిఐ హయాంలో మూడుసార్లు ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు పొందిందని రాజకీయ ఓనమాలు తెలియని, ఎదులాపురం చరిత్ర తెలియని వ్యక్తులు విమర్శలు చేస్తే సహించబోమన్నారు. గుర్రాలపాడు దగ్గర భూమిని రుద్ర టౌన్షిప్ కోటి దాబా వెనుక గల తమ పొలాన్ని అమ్ముకుని కొనుగోలు చేశామని అది గ్రామ ప్రజలందరికీ తెలుసునన్నారు.

సిఐ సారూ పద్ధతి మార్చుకోండి :

రూరల్ సిఐ శ్రీనివాసరావు తన పద్దతి మార్చుకోవాలని బెల్లం వేణు ప్రోద్బలంతో అక్రమ కేసులు పెడుతూ సిపిఐ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని సురేష్ ఆరోపించారు. దొంగ రాళ్ల వ్యాపారులతో భూజాల మీద చేతులు వేసి ఫోటోలకు ఫోజులిచ్చే సిఐకి ప్రజాక్షేత్రంలో ఉండే నాయకులతో మాట్లాడేందుకు మాత్రం సిగ్గు అనిపిస్తుందా ఆయన ప్రశ్నించారు. లెప్రసీ కాలనీలో సిఐ ప్రోద్భలంతోనే కమ్యూనిస్టు హాల్ ఆక్రమణ జరిగిందని ఆక్రమణను అడ్డుకోవడానికి వెళితే ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారని దీనిపై ఎంఎల్ఎ కందాళ ఉపేందర్రెడ్డికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఏపూరి గోపి అనే యువకున్ని కొందరు తీవ్రంగా కొడితే కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదని ఈ విషయమై ప్రశ్నించడానికి సిఐ వద్దకు వెళితే బెదిరింపులకు పాల్పడ్డారని సురేష్ తెలిపారు. ఇటీవల జరిగిన ఒక హత్య విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ తమను భయపెట్టేందుకు సిఐ ప్రయత్నిస్తున్నారని ఆయన పోలీస్ అధికారిలా కాక వేణు అనుచరునిలా వ్యవహరిస్తున్నారని అన్నారు .

ఖమ్మం రూరల్ మండలంలో భూ పంచాయతీల్లో తలదూర్చి బెల్లం వేణు బాధితులను బెల్లం వేణు వద్దకు వెళ్లి పరిష్కారం చేసుకోండి అంటూ సిఐ సలహా ఇస్తున్నారని బెల్లం వేణు చెప్పిన వారికి మద్ధతుగా నిలబడుతున్నారని స్థానిక తహసీల్దార్ సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారని ఇందుకు సంబంధించి బాధితులు కూడా మీడియా సమావేశంలో ఉన్నారని సురేష్ తెలిపారు. విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సిద్దినేని కర్ణకుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు మిడికంటి వెంకటరెడ్డి, అజ్మీర రామ్మూర్తి, జిల్లా నాయకులు పుచ్చకాయల సుధాకర్రావు, ఉన్నం రంగారావు, చెరుకుపల్లి భాస్కర్, పగిళ్ల వీరభద్రం, మేళ్లచెరువు లలిత, బోజడ్ల సూర్యారావు, పలువురు జిల్లా సమితి సభ్యులు, ఎంపిటిసిలు, సర్పంచులు, మండల కార్యవర్గ సభ్యులు, పలువురు బెల్లం వేణు బాధితులు పాల్గొన్నారు.

Related posts

సుప్రీం జడ్జిల నియామకాల వార్తలపై సీజేఐ రమణ అసహనం!

Drukpadam

హైదరాబాద్ ‘జూ’లోని సింహాలకు వచ్చింది కరోనా కాదు.. సార్స్ కొవ్-2!

Drukpadam

బీహార్ ప్రభుత్వానికి రూ.4 వేల కోట్ల భారీ జరిమానా…!

Drukpadam

Leave a Comment