Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కొత్తగా రాష్ట్రంలో 13 మండలాల ఏర్పాటు …ఖమ్మం జిల్లాలో సుబ్లేడు మండలానికి కలగని మోక్షం !

తెలంగాణ‌లో కొత్త‌గా 13 రెవెన్యూ మండ‌లాల ఏర్పాటు!

  • సిద్దిపేట జిల్లాలో అత్య‌ధికంగా 3 కొత్త మండలాలు
  • జ‌గిత్యాల‌, మ‌హ‌బూబాబాద్‌, నిజామాబాద్ జిల్లాల్లో రెండేసి కొత్త మండ‌లాలు
  • ఉత్త‌ర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్ కుమార్‌

కొత్తగా రాష్ట్రంలో 13 మండలాల ఏర్పాటు …ఖమ్మం జిల్లాలో సుబ్లేడు మండలానికి కలగని మోక్షం .
తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మరో 13 మండలాలని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసేంది.అయితే ఇందులో ఖమ్మంజిల్లాలో ఎప్పటి నుంచే ప్రజలు వివిధ రాజకీయపార్టీలు డిమాండ్ చేస్తున్న పాలేరు నియోజకవర్గంలోని సుబ్లేడు ,లేదా బచ్చోడు మండలం ఏర్పాటు చేస్తారని భావించినప్పటికీ అదిజరగలేదు . తిరుమలాయపాలెం మండలం పెద్దగా ఉండటంతో పాటు దాని విస్తరణ గ్రామ పంచాయతీల సంఖ్యకూడా అధికంగానే ఉంది. అందువల్ల అక్కడ మరో మండలం ఏర్పాటు చేయాలనీ ప్రజలు కోరుకుంటున్నారు .అక్కడ ప్రజా ప్రతినిధులు అధికార పార్టీ నాయకులు పెద్దగా పట్టు పట్టక పోవడం పై విమర్శలు ఉన్నాయి.

ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటు త‌ర్వాత తెలంగాణ‌లో పాల‌నా సౌల‌భ్యం కోసం కేసీఆర్ స‌ర్కారు ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా కొత్త జిల్లా, కొత్త రెవెన్యూ డివిజ‌న్లు, కొత్త మండ‌లాల‌ను ఏర్పాటు చేస్తూ సాగిన టీఆర్ఎస్ స‌ర్కారు.. తాజాగా రాష్ట్రంలో మ‌రో 13 రెవెన్యూ మండ‌లాల‌ను ఏర్పాటు చేస్తూ సోమ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

సోమ‌వారం కొత్త మండ‌లాలుగా ఏర్పాటైన వాటిలో భీమారం, ఎండ‌వ‌ల్లి (జ‌గిత్యాల జిల్లా), నిజాంపేట్ (సంగారెడ్డి జిల్లా), గ‌ట్టుప్ప‌ల్ (న‌ల్ల‌గొండ జిల్లా), సీరోలు, ఇనుగుర్తి (మ‌హ‌బూబాబాద్ జిల్లా), కౌకుంట్ల (మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా), అక్బ‌ర్ పేట్‌, భూంప‌ల్లి, కుకునూర్‌ప‌ల్లి (సిద్దిపేట జిల్లా), డోంగ్లీ (కామారెడ్డి జిల్లా), ఆలూర్‌, డొంకేశ్వ‌ర్‌ సాలూరా (నిజామాబాద్ జిల్లా) ఉన్నాయి. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ తుది నోటిఫికేష‌న్ జారీ చేశారు.

Related posts

బిలియనీర్‌ జార్జ్ సోరోస్‌పై విదేశాంగ మంత్రి జయశంకర్ తిట్ల దండకం !

Drukpadam

ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా కు మళ్ళీ సిబిఐ సమన్ల కలకలం …

Drukpadam

చేకూరి కాశయ్య మృతికి.. వెంకయ్యనాయుడు , కేసీఆర్,నామ తుమ్మల , సంతాపం

Drukpadam

Leave a Comment