Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో తొలి అరెస్ట్‌..

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో తొలి అరెస్ట్‌.. ‘ఓన్లీ మ‌చ్ లౌడ‌ర్‌’ సీఈఓ నాయర్ ను అరెస్ట్ చేసిన సీబీఐ!

  • సీబీఐ ఎఫ్ఐఆర్‌లో ఐదో నిందితుడిగా ఉన్న నాయ‌ర్‌
  • ఈవెంట్ మేనేజ్‌మెంట్ లో సేవ‌లు అందిస్తున్న ఓన్లీ మ‌చ్ లౌడ‌ర్‌
  • నాయ‌ర్‌ను ముంబై నుంచి ఢిల్లీకి త‌ర‌లించిన సీబీఐ

దేశ రాజ‌ధాని ఢిల్లీలో వెలుగు చూసిన లిక్క‌ర్ స్కాంలో మంగ‌ళ‌వారం కీల‌క మ‌లుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్ప‌టిదాకా విచార‌ణ‌ల వ‌ర‌కే ద‌ర్యాప్తు కొన‌సాగ‌గా… మంగ‌ళ‌వారం తొలి అరెస్ట్ న‌మోదైంది. ఈ వ్య‌వ‌హారంపై తొలుత కేసు న‌మోదు చేసిన సీబీఐ అధికారులు మంగ‌ళ‌వారం ‘ఓన్లీ మ‌చ్ లౌడ‌ర్’ సంస్థ సీఈఓగా ప‌నిచేస్తున్న విజ‌య్ నాయ‌ర్‌ను అరెస్ట్ చేశారు.

ముంబై కేంద్రంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగంలో సేవ‌లు అందిస్తున్న ఓన్లీ మ‌చ్ లౌడ‌ర్ కంపెనీ ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ సంస్థ సీఈఓగా ఉన్న విజ‌య్ నాయ‌ర్‌ను ఈ కేసులో ఐదో నిందితుడిగా సీబీఐ అధికారులు త‌మ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. కేసు ద‌ర్యాప్తులో భాగంగా విజ‌య్ నాయ‌ర్‌కు చెందిన కీల‌క ఆధారాలు ల‌భించ‌డంతో మంగ‌ళ‌వారం ముంబైలో ఉన్న ఆయ‌న‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అదుపులోకి తీసుకున్న నాయ‌ర్‌ను సీబీఐ ఢిల్లీకి త‌ర‌లించింది.

Related posts

నా భర్త ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇండస్ట్రీ వాళ్లే చంపారు:నటి కృష్ణవేణి!

Drukpadam

వాజేడు ఎస్సై ఆత్మహత్య వెనక యువతి.. దర్యాప్తుల్లో వెలుగులోకి విస్తుపోయే విషయాలు!

Ram Narayana

చిన్నారిని దత్తత పేరుతొ వ్యభిచారంలోకి దించిన మహిళ

Drukpadam

Leave a Comment