అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయాలను తలదన్నేలా రైల్వే స్టేషన్…
- అహ్మదాబాద్‌లో సరికొత్త హంగులతో రైల్వే స్టేషన్
- వరల్డ్ క్లాస్ ప్రమాణాలతో నిర్మించేందుకు కేంద్రం నిర్ణయం
- ఊహా చిత్రాలను విడుదల చేసిన కేంద్ర మంత్రి గోయల్
ప్రధాని సొంతరాష్ట్రం అహమ్మదాబాద్ లో అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఇప్పటికే అక్కడ అనేక కొత్త ప్రాజక్టు లను చేపట్టినకేంద్రం ఇప్పుడు అహమ్మదాబాద్ రైల్వే స్టేషన్ ను ప్రపంచస్థాయి స్టేషన్ గా తీర్చిదిద్దెందుకు సిద్ధమైంది.ఈమేరకు దాని ఊహాచిత్రాలను కూడా రైల్వే శాఖ విడుదల చేసింది.
గుజరాత్ వాణిజ్య రాజధానిగా ప్రసిద్ధికెక్కిన అహ్మాదాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఓ రైల్వే స్టేషన్‌ను నిర్మించేందుకు కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వరల్డ్ క్లాస్ వసతులతో అలరారుతున్న అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఏ ఒక్క ఎయిర్ పోర్టుకు తీసిపోని విధంగా ఈ రైల్వే స్టేషన్‌ను తీర్చిదిద్దనున్నట్లు సమాచారం.
ఈ మేరకు అహ్మాదాబాద్‌లో నిర్మించనున్న వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ ఊహా చిత్రాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బుధవారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. త్వరలోనే అహ్మదాబాద్ ప్రజలకు అందుబాటులోకి రానున్న ఈ రైల్వే స్టేషన్ వసతుల విషయంలో ఏ ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసిపోదని గోయల్ పేర్కొన్నారు. అహ్మదాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తున్న మరో బహుమతిగా ఈ రైల్వే స్టేషన్ నిలవనున్నట్లు ఆయన తెలిపారు.