Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

శాసనసభలో చాడ వెంకటరెడ్డి ప్రసంగాల పుస్తక ఆవిష్కరణ …..

“అసెంబ్లీ సాక్షిగా నా పోరాటం” పుస్తకావిష్కరణ

సిపిఐ మాజీ రాష్ట్ర కార్యదర్శి,మాజీశాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి శాసనసభలో చేసిన ప్రసంగాలను సేకరించి పుస్తకరూపంలో తెచ్చారు. ఆ పుస్తకాన్ని హైద్రాబాద్ లోని శాసనసభ ప్రాంగణంలోప్రస్తుత శాసనమండలి చైర్మన్,గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కలిసి సంయుక్తంగా ఆవిష్కరించారు . ముందుగా పుస్తకంలో తొలిపలుకులు రాసిన రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ వెంకటరెడ్డి శాసనసభ్యులుగా పార్టీ నాయకుడిగా నిర్వహించిన పాత్ర గురించి వివరించారు . తరవాత రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీష్ రావు , మాట్లాడుతూ సీఎంగా ఉన్న రాజశేఖర్ రెడ్డి నేను తెలంగాణ కు అడ్డంకాదు , నిలువుకాదని అండతో వెంటనే లేచిన చాడ వెంకటరెడ్డి నీవు అడ్డం నిలువుకాదు కానీ వంకరగా ఉన్నావని అనడంతో సభ అంత గొల్లున నవ్విన విషయాన్నీ గుర్తు చేశారు.ముదిగొండ కాల్పుల ఘటన కమిటీ వేయించిన తీరు గురించి వివరించారు . మొదటిసారిగా సభకు వచ్చినా క్షేత్ర స్థాయిలో విషయాలు సభ దృష్టికి తెచ్చిన తీరు అద్భుతంగా ఉండేదని అన్నారు . సభలో ప్రజాసమస్యల పై నిలదీసిన తర్వాత సంబంధిత మంత్రులను సీఎం ను కలిసి వినతి పత్రాలు ఇచ్చిన తీరును వివరించారు .

సిపిఐ కి చెందిన జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీలు ,ఎమ్మెల్యేల ప్రసంగాలు అచ్చువేయడం వల్ల భావితరాలకు ఉపయోగపడుతుందని అన్నారు . శాసనసభ సమావేశాలు ఎక్కువ రోజులు జరిగితే సభ్యులు ఎక్కువ సమయం మాట్లాడేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు . తమ సమస్యలను సభలో చెప్పుకునే వీలులేకపోతే వీధి పోరాటాలకు దారితీస్తుందని దీన్ని సభాపతులు ఆలోచించాలని అన్నారు . అయితే సభాపతుల చేతుల్లోకూడా అవిలేకపోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ భవిషత్ లో చట్టసభలు ఈవిధంగా ఉంటాయా ?ఈ పుస్తకం మ్యూజియం లో పెట్టుకునేందుకు పనికొస్తాయనే అభిప్రాయాలూ ఉన్నాయి. పార్లమెంట్ లో తెచ్చిన వ్యవసాయ చట్టాన్ని గురుంచి గుర్తు చేశారు . పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సభ్యులు , సభ్యుల అభిప్రాయాలు , హక్కులు గురించి పక్కన పెడుతున్న కాషాయ శక్తులగురించి అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను …చాడ అనుభవజ్ఞులు వారి అభిప్రాయాలూ గురించి పుస్తక రూపంలో తీసుకోని రావడం అభినందనీయమని అన్నారు.

సిపిఐ మాజీ శాసనసభా పక్ష నాయకులు చాడ వెంకట్ రెడ్డి శాసనసభా ప్రసంగాల “అసెంబ్లీ సాక్షిగా నా పోరాటం” పుస్తకావిష్కరణ సభ మంగళవారం సాయంత్రం అసెంబ్లీ ప్రాంగణంలో ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు పాల్గొన్నారు

, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి వి.ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కార్యదర్శులు కునంనేని సాంబశివరావు, రామకృష్ణ, , సిపిఐ జాతీయ సమితీ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర హైండ్లుమ్ అభివృద్ధి సంస్థ ఛైర్మెన్ చింత ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ అసెంబ్లీలో అరుదైన స‌న్నివేశం.. భట్టి పై ప్ర‌శంస‌లు!

Drukpadam

వైట్ ఛాలంజ్ కు దూరంగా కేటీఆర్ …కేటీఆర్ కోసం ఎదురు చుసిన రేవంత్ ,విశ్వేశర రెడ్డి!

Drukpadam

పాల్వంచలో స్వల్ప భూకంపం… పరుగులు తీసిన ప్రజలు!

Drukpadam

Leave a Comment