Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ లో కొత్త ట్విస్ట్ ….అధ్యక్ష బరిలో మల్లిఖార్జున ఖర్గే …

కాంగ్రెస్ లో కొత్త ట్విస్ట్ ….అధ్యక్ష బరిలో మల్లిఖార్జున ఖర్గే …
శశిథరూర్ …ఖర్గే మధ్య పోటీ …ఖర్గే ఎన్నిక లాంఛనమే అంటున్న పరిశీలకులు
నామినేష‌న్లు దాఖ‌లు చేసిన ఖ‌ర్గే, థ‌రూర్‌…
రాజీవ్‌కు నివాళి అర్పించి నామినేష‌న్ వేసిన థ‌రూర్‌
గెహ్లాట్ స‌హా సీనియ‌ర్లు వెంట రాగా నామినేష‌న్ వేసిన ఖ‌ర్గే
ఖ‌ర్గే ఎన్నిక ఖాయ‌మేనంటూ విశ్లేష‌ణ‌లు

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి జ‌రుగుతున్న ఎన్నికల్లో శుక్ర‌వారం ఓ కీల‌క ఘ‌ట్టం పూర్తయింది. అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన పార్టీ సీనియ‌ర్ నేత‌లు, కేంద్ర మాజీ మంత్రులు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, శ‌శి థ‌రూర్‌లు త‌మ నామినేష‌న్ ప‌త్రాలను దాఖ‌లు చేశారు. తొలుత శ‌శి థ‌రూర్ మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీకి నివాళి అర్పించి త‌న‌ నామినేష‌న్ దాఖ‌లు చేయ‌గా… ఆ త‌ర్వాత కాసేప‌టికే ఖ‌ర్గే నామినేష‌న్ ప‌త్రాల‌ను దాఖ‌లు చేశారు.

పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి కోసం ఇద్ద‌రు నేత‌లు నామినేష‌న్ దాఖ‌లు చేసిన నేప‌థ్యంలో పోలింగ్ అనివార్యమేన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. నామినేష‌న్ ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌డువు ఉన్నా… థ‌రూర్‌, ఖ‌ర్గేలు త‌మ నామినేష‌న్ల‌ను ఉప‌సంహ‌రించుకునే అవ‌కాశాలు లేవ‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే… అధ్య‌క్ష ప‌ద‌వికి ఖ‌ర్గే ఎన్నిక‌వ‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ఖ‌ర్గే నామినేష‌న్ దాఖ‌లు సంద‌ర్భంగా ఆయ‌న వెంట బ‌రి నుంచి త‌ప్పుకున్న రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ స‌హా పెద్ద సంఖ్య‌లో నేత‌లు ఉన్నారు. అంతేకాకుండా సామాజిక స‌మీక‌రణాలు తీసుకున్నా… ద‌ళిత వ‌ర్గానికి చెందిన ఖ‌ర్గేకే విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

బరి నుంచి తప్పుకున్న దిగ్విజయ్ సింగ్.. మల్లికార్జున ఖర్గే – శశి థరూర్ ల మధ్యే పోటీ
ఉత్కంఠను రేపుతున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక
ఖర్గేపై పోటీ చేయలేనన్న దిగ్విజయ్ సింగ్
ఇప్పటికే బరి నుంచి తప్పుకున్న అశోక్ గెహ్లాట్

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పలు మలుపులు తిరుగుతూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇప్పటికే రేసు నుంచి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తప్పుకోగా… తాజాగా దిగ్విజయ్ సింగ్ కూడా తప్పుకున్నారు. మల్లికార్జున ఖర్గే అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగడంతో… డిగ్గీరాజా పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిలో మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ మాత్రమే మిగిలారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ ప్రక్రియ ముగియనుంది.

మరోవైపు ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ… మల్లికార్జున ఖర్గే తనకు సీనియర్ అని… నిన్న ఆయన నివాసానికి తాను వెళ్లానని, మీరు పోటీ చేస్తే తాను బరి నుంచి తప్పుకుంటానని చెప్పానని తెలిపారు. అయితే, తాను పోటీ పడటం లేదని ఆయన అన్నారని… అయితే, అధ్యక్ష పదవికి ఖర్గే పోటీ చేయబోతున్నారంటూ మీడియాలో వస్తున్న కథనాలను తాను చూశానని, అందుకే బరినుంచి తప్పుకున్నానని చెప్పారు. తాను ఖర్గేకు మద్దతుగా నిలుస్తానని, ఆయనపై పోటీ చేసే ఆలోచనను కూడా తాను చేయనని అన్నారు.

తన జీవితంలో ఇప్పటి వరకు కాంగ్రెస్ కే పని చేశానని, చివరి వరకు కాంగ్రెస్ తోనే ఉంటానని దిగ్విజయ్ చెప్పారు. దళితులు, గిరిజనులు, పేదలకు అండగా నిలవడం, మత సామరస్యానికి విఘాతం కలిగించే వారిపై పోరాడటం, నెహ్రూ-గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉండటం… ఈ మూడు అంశాలలో తాను ఎప్పటికీ రాజీపడలేనని అన్నారు.

Related posts

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు సీపీఎం మద్దతు: తమ్మినేని వీరభద్రం!

Drukpadam

రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ లకు రాహుల్ ఫోన్ …సాగర్ పై ఆరా ?

Drukpadam

అమిత్ షా  గారూ.. నన్ను కాపాడండి: ఢిల్లీలో వైసీపీ నేత సుబ్బారావు గుప్తా ప్రదర్శన!

Drukpadam

Leave a Comment